సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ అసెంబ్లీ (84) కు సంబంధించిన 2023 ఎలక్షన్ కు సంబందించిన ఈవీఎం యంత్రాలు బుధవారం సాయంత్రం వచ్చేశాయి. షాద్ నగర్ ఆర్డీఓ వెంకట మాధవరావు, ఫరూఖ్ నగర్ తాసిల్దార్ పార్థసారధి తదితర రెవెన్యూ సిబ్బంది స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈవీఎంల రాక సందర్భంగా స్థానిక ఏసీపీ రంగస్వామి పర్యవేక్షణలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక సిఐ ప్రతాప్ లింగం అదేవిధంగా స్థానిక అన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వ స్టేడియం వద్దకు చేరుకున్నారు. అధికారులు వారి సమక్షంలో ఈవీఎం యంత్రాలను తీసుకోవచ్చారు. వాటినీ స్ట్రాంగ్ రూమ్ లో పెట్టించారు. ఈ సందర్భంగా రెవిన్యూ అధికారులు మాట్లాడుతూ అసెంబ్లీ పరిధిలో మొత్తం 252 పోలింగ్ బూతులు ఉన్నాయని, వీటికోసం 310 ఈవిఎం యంత్రాలు ఇక్కడ ఉంచినట్టు అధికారులు వివరించారు. 252 బూతుల కోసం అదనంగా కొన్ని ముందు జాగ్రత్త చర్యలు ఇవి యంత్రాలు ఉన్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ నాయకుల మీడియా సమక్షంలో ఆయా పార్టీల ప్రజా ప్రతినిధులు నాయకులు సంతకాలు సేకరించారు.
-----------------------
Admin