సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అర్హత కలిగిన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని కాలీ జాగా ఉన్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం 5: 50 లక్షలు కేంద్ర ప్రభుత్వం పది లక్షలు కేటాయించి ఇల్లు కట్టించాలని, ప్రభుత్వం ఇల్లు స్థలాలు కేటాయించకపోతే ప్రభుత్వ భూములు గుర్తించి ఆక్రమిస్తామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పోతునేని సుదర్శన్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు అదేవిధంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న సాగుదారులకి పట్టా హక్కులు ఇవ్వడంలో ప్రభుత్వం కొంత పక్షపాత ధోరణి ప్రదర్శిస్తుందని అర్హులైన వాళ్ళందరికీ పట్టా హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు* సోమవారం తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పట్టా హక్కు కల్పించాలని, కోరుతూ స్థానిక నవభారత సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో ఇల్లందు సుజాతనగర్ చుంచుపల్లి మండలాల్లో 940 మంది ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని నివాసం ఉన్నారని గత నాలుగు సంవత్సరాలుగా కనీస సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన అన్నారు మరోవైపు ప్రజలేసుకున్న గుడిసెల్ని స్థానిక ప్రజాప్రతినిధులు పోలీస్ ప్రోత్బలంతో ఖాళీ చేపించడానికి ప్రయత్నం చేస్తుందని అనేక ఇబ్బందులు గురి చేస్తుందని ఆయన అన్నారు ఇప్పటికే సుజాతనగర్ ఇల్లందు లాంటి చోట్ల 55 మంది మీద నాలుగు కేసులు నమోదు అయినయి అని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 20 కోట్లు ఇండ్లు మంజూరు చేసినట్టు పేదలకు కట్టించినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముందు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు ఒకవేళ బిజెపి ప్రభుత్వం 20 కోట్లు ఇండ్లు కట్టిస్తే దేశంలో పేదవాళ్లు ఉండే అవకాశం లేదని ఇండ్లు లేని వారు ఉండే అవకాశం లేదని ఆయన అన్నారు విదేశాల ముందు ప్రపంచవ్యాప్తంగా బరితెగించి అబద్ధాలు చెప్పటం ప్రధానమంత్రి దిగజారుడుతనాని కి నిదర్శనం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టించడంలో ఇల్లు స్థలాలు ఇవ్వడంలో ఒకరినొకరు ప్రకటనలు చేయడం తప్ప ఆచరణలో ఒక్క ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదని ఆయన అన్నారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబల్ బెడ్ రూమ్ పేరుతో కొన్ని అక్కడక్కడ కట్టించి వదిలేసిందని పేదలకు పంపిణీ చేసిన దాఖలాలు లేవని ఆయన ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో పేద ప్రజల అన్న వారి సమస్యలు పరిష్కరించాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి పట్టటం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గృహలక్ష్మి పథకంలో సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే వారికి మూడు లక్షల రూపాయలు మూడు విడతలు గా ఇస్తామని ప్రకటించడం ఆస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు మూడు లక్షల రూపాయలతో ఇల్లు ఎట్లా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు కాసాని ఐలయ్య అన్నవరపు కనకయ్య మచ్చ వెంకటేశ్వర్లు మందలపు జ్యోతి హరికృష్ణ లు మాట్లాడుతూ తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జూన్ 18వ తేదీ నుండి 27వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 64 పోరాట కేంద్రాలను పరిశీలించిన అనంతరం జూన్ మూడో తేదీన కలెక్టర్ కార్యాలయాలు వద్ద మహాధర్నాకి పిలుపునియ్యడం జరిగిందని వారు అన్నారు రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఎన్ని ఇబ్బందులకు గురవుతున్నదో యాత్ర బృందం ప్రత్యక్షంగా పరిశీలించిందని ఈ పరిశీలన నుంచి కొన్ని డిమాండ్స్ రూపొందించాలని వారు పేర్కొన్నారు అందులో ప్రభుత్వ భూముల్లో లో ఇల్లు నిర్మించుకున్న ప్రతి ఒక్కరికి 120 గజాల స్థలాన్ని పట్టా చేసి ఇవ్వాలని, ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు ఆర్థిక సాయం అందించాలని వారి డిమాండ్ చేశారు అదేవిధంగా కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను వెంటనే పేదలకు పెంచాలని వారు అన్నారు గతంలో పట్టా పొందిన పేదలకు ఇండ్ల జాగా సరిహద్దును నిర్ణయించి భూమిని అప్పగించాలని ఇంటి స్థలం లేని పేదలకు ఇంటి స్థలం కేటాయించి కనీసం ఐదు లక్షలు నిర్మాణం ఇవ్వాలని వారు పేర్కొన్నారు గృహలక్ష్మి పథకం నిబంధనలు మార్చి ప్రభుత్వ భూముల గుడిసెలు వేసుకున్న ప్రతి పేదవాడికి వర్తింపచేయాలని వారు పేర్కొన్నారు ఇల్లు నిర్మించుకున్న పేదలపై ప్రభుత్వం నిర్బంధాన్ని నిలుపుదల చేయాలని పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు అలాగే రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు లక్షల మందికి పోడు భూమి పట్టాలు ఇచ్చారని మిగిలిన వారికి పట్టా అక్కు కల్పించాలని గిరిజనేతర పేదలకు పొజిషన్ సర్టిఫికెట్ అయినా ఇచ్చి భూమి నుండి ఖాళీ చేయించకుండా చూడాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ ఉపాధ్యక్షులు కొక్కిరపాటి పుల్లయ్య తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు చిరంజీవి నాయుడు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎంపీ నర్సారెడ్డి డి వీరన్న మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి లక్ష్మి ఎస్ లక్ష్మి ఆవాజ్ జిల్లా సెక్రెటరీ నబి పట్నం జిల్లా కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ సోషల్ మీడియా కన్వీనర్ బుక్య రమేష్ నాయకులు దొడ్డ రవికుమార్ కొండబోయిన వెంకటేశ్వర్లు వినోద స్వామి భక్తుల వెంకటేశ్వర్లు సత్య వాణి వీర్ల రమేష్ రామిరెడ్డి యాసా నరేష్ మోరంపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin