సర్కార్ టీవీ న్యూస్ / సంగారెడ్డి జిల్లా : కంగ్టి మండలం తడ్కల్ గ్రామ రైతు వేదికలో ఆదివారం మార్కుఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. సంజీవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – “రైతుల లాభమే మాకు ముఖ్యం. ప్రభుత్వం నష్టపోయినా రైతులకు మేలు అయితే చాలు. కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం,” అన్నారు. జొన్నలు క్వింటాల్‌కు రూ.3371 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని, వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఏఓ హరీష్, పిఏసిఎస్ చైర్మన్ మారుతి రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లరెడ్డి, యూత్ కాంగ్రెస్ నేత విఠల్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin