సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణ ఆధిపత్యంలో ఉన్న బీఆర్ఎస్ పాలనను కూకటివేళ్ళతో పెకిలించేందుకు నడుంబిగించిన బీఎస్పీ ముఖ్యమంత్రి అభ్యర్థి,రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్.ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ బుధవారం కొత్తగూడెం రానున్నారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ తెలిపారు.స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో డాక్టర్ ఆర్ఎస్పి పర్యటన వివరాలను తెలిపారు.స్థానిక ఓల్డ్ బస్ డిపో నుంచి వేలాది మంది కార్యకర్తలతో ర్యాలీగా సూపర్ బజార్ నుంచి బస్టాండుకు చేరుకొని అక్కడ అమరవీరులకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాళులు అర్పించనున్నారని,అనంతరం కొత్తగూడెం క్లబ్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారని తెలిపారు.పార్టీ అంతర్గత సర్వేలలో,పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలలో కొత్తగూడెం నియోజకవర్గం లో బీఎస్పి గెలుపు ఖాయమని తేలిందన్నారు.కొత్తగూడెం క్లబ్ లో జరిగే బహిరంగ సభకు వేలాదిగా పార్టీ కార్యకర్తలు,అభిమానులు,యువజన,మహిళా విభాగం నాయకులు,స్వేరో దాని అనుబంధ సంఘాల నాయకులు,బహుజనవాదాన్ని బలపరిచే వారు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి, చేరికల కమిటీ చైర్మన్ గుడివాడ రాజేందర్,అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin