సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలో వెలుగు ఆఫీస్ లో ఆర్థిక సార్థక అవగాహన సదస్సు పై ఏ డి సి సి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమంలో మేనేజర్ పి కుసుమకుమారి మాట్లాడుతూ బ్యాంకులో పొదుపు ఖాతా యొక్క ఆవశ్యకతను వివరించారు ముఖ్యంగా సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ గురించి క్లుప్తంగా వివరించారు ఖాతాదారులు 436 రూపాయలు సంవత్సరమునకు కట్టి ఇన్సూరెన్స్ చేసుకోవడం వలన ఆక్సిడెంట్ మరియు సహజ మరణమునకు ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయలు వర్తించునని మరియు 20 రూపాయలు సంవత్సరమునకు కట్టడం వలన యాక్సిడెంట్ వలన జరిగిన మరణానికి రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వర్తించునని వివరించారు మరియు బ్యాంకులో ఇస్తున్నటువంటి జగనన్న పాలవెల్లువ లోన్లు కేవలం 7% బంగారు రుణములు 70 పైసల, ఎస్ హెచ్ జి లోన్లు జే ఎల్ జి లోన్లు గవర్నమెంట్ సబ్సిడీతో ఇస్తున్నటువంటి సిహెచ్ లోన్లు జగనన్న తోడు క్రాప్ లోను ఉన్న రైతుకి పశువులు ఉన్నట్లయితే వారికి వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ ఇస్తున్నట్టుగా తెలిపారు పై తెలిపిన ఏ లోనికి కూడా ప్రాసెసింగ్ చార్జెస్ లేకుండానే ఇవ్వడం జరుగుతుందని వివరించారు మరియు వెహికల్ లోన్స్ ఇస్తున్నట్టుగా తెలపడం జరిగినది. బ్యాంకు వారు అందిస్తున్నటువంటి పై తెలుపబడినటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని వివరించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పి ఇంతియాజ్, వెలుగు ఏపీఎం రమణప్ప, సీసీలు హేమభూషణ్ ,శ్రీనివాసులు, వేణుగోపాల్, వెంకటరమణ, మరియు వెలుగు సిబ్బంది ఆనిమేటర్లు మహిళా సంఘాలు పాల్గొనడం జరిగింది..
-----------------------
Admin