సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ : అర్ధరాత్రి దారుణం జరిగింది... కోదాడ జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మరణించాడు. అయితే చీకట్లో మృతదేహం కనిపించకపోవడంతో ఆ హైవే మీదుగా వచ్చిన వాహనాలన్నీ తొక్కుకుంటూ వెళ్లాయి.దాంతో ఆ మృతదేహంలోని శరీర భాగాలన్నీ గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయ్యాయి. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆ ఛిద్రమైన మృతదేహాన్ని పోస్టు మార్టానికి పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...
-----------------------
Admin