సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణతో పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఒక్కరు పాటించాల్సిందేనని అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ టి.విజయ్ కుమార్ ఆధ్వర్యంలో షాద్ నగర్ నియోజకవర్గం బూత్ స్థాయి, బిజెపి ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం స్థానిక ఏ బి కన్వెన్షన్ లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బిజెపి అభ్యర్థి అందె బాబయ్య, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, దేపల్లి అశోక్ గౌడ్, నందిగామ వెంకటేష్ దేశ్ముఖ్, భూపాల చారి, నర్సింహా గౌడ్, వెంకటేష్ గుప్త, చెంది మహేందర్ రెడ్డి, వంశీ కృష్ణ, మనోహర్ రెడ్డి, చెట్ల వెంకటేష్, మోటే శ్రీనివాస్, ప్యాట అశోక్, సోప్పరి నర్సింహా, ఎంకనోళ్ల వెంకటేష్, మఠం ఋషికేష్, దొడల వెంకటేష్, బోయ కురుమయ్య, నాగరాజు చారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. షాద్ నగర్ లో బిజెపి జెండా ఎగరవేయడమే లక్ష్యంగా కార్యకర్తలు అందరూ పార్టీ కోసం, సిద్ధాంతం కోసమే పని చేయాలని అన్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అందే బాబన్న అనీ, అందరం బాబన్నకు మద్దతుగా నిలుద్దామని అన్నారు. కార్యకర్తలు ఎవరు ఎవరి ప్రలోభాలకు గురి కావద్దని, బిజెపి జెండా నే మన ఎజెండా అని అన్నారు. ఈసారి తెలంగాణలో కూడా మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కర్ణాటకలో అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని అన్నారు. నిరుపేద ప్రజలకు ఒక సుపరిపాలన కావాలంటే మోడీ వల్లనే సాధ్యమని అన్నారు. ఈసారి కార్యకర్తలందరూ సంఘటితంగా కష్టపడి పని చేసి బిజెపి అభ్యర్థి బాబన్న ను గెలిపించుకోవాలని అన్నారు. రంగారెడ్డి జిల్లాను పూర్తిగా మోసం చేస్తున్న ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం అని అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం అభివృద్ధి కావాలంటే బిజెపితోనే సాధ్యమని అన్నారు. సిద్ధాంతాలతో నిర్మాణమైన పార్టీ బిజెపి అని, వ్యక్తుల ఎజెండాతో పార్టీ నడవదని, బిజెపి లో పని చేసే ప్రతీ కార్యకర్త గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్బంగా అందె బాబయ్య గమాట్లాడుతూ.. పార్టీ లోకి వచ్చిన తక్కువ సమయం లోనే నా సేవలు గుర్తించి టికెట్ ఇచ్చిన అధిష్టణానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేసారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని,ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటానని అన్నారు. కార్యకర్తల కృషితో, ప్రజల ఆశీర్వాదంతో షాద్ నగర్ గడ్డ మీద బిజెపి జండా ఎగురవేస్తానని అన్నారు. షాద్ నగర్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్బంగా సీనియర్ నాయకులందరూ మాట్లాడుతూ.. పార్టీ ఏది ఆదేషిస్తే దానికి కట్టుబడి ఉంటామని అన్నారు. బిజెపి విజయమే లక్ష్యం గా అందరం కలిసి కట్టుగా పని చేద్దామని అన్నారు. ఇందులో భాగంగా వివిధ మండలాలకు చెందిన యువకులు 50 మందికి పైగా బిజెపిలో చేరారు. ఈ సందర్బంగా అందె బాబయ్య, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి కండువాతో వారిని పార్టీ లోకి స్వాగతించారు. ఈ కార్యక్రమం లో వివిధ మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin