సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రైబల్ జర్నలిస్టులందరికీ ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈనెల19న సోమవారం జిల్లాలోని టిడబ్ల్యూజేఏ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు ఇవ్వాలని ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టిడబ్ల్యూజేఏ) రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునిస్తున్నాం.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రైబల్ జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇచ్చేంతవరకు మన పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నాం.. ట్రైబల్ జర్నలిస్టుల ఇండ్ల సాధన కోసం క్రియాశీలక పోరాటానికి మనం ముందుండాలని తెలియజేస్తున్నాం.. ఇప్పటికే రాష్ట్రంలో బలమైన ట్రైబల్ జర్నలిస్టు యూనియన్ గా ఉన్నామని,ట్రైబల్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మనమే ముందుగా ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. మిత్రులారా మిస్ అవ్వకుండా జిల్లాల్లో వినతి పత్రాలు ఇవ్వాలి అని నిర్ణయించారు.
-----------------------
Admin