సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం లక్ష్మీపురం శివారులో జరిగిన వివాహిత తాళ్ల పెళ్లి సుమలత హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో మృతురాలి ప్రియుడే అంతకుడిగా తేలినట్లు నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి మంగళవారం రోజున మీడియా కు వెల్లడించారు. ఈ కేసు పై ముందుగా 24 వ తారీఖున ప్రియుడే హంతకూడా లక్ష్మీపురం శివారులో మహిళా దారుణ హత్య కేసులో ప్రచురితం చేయడం జరిగింది 'సర్కార్ టీవీ'దినపత్రిక ప్రచురించిన కథనం అక్షర సత్యమైందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.... లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్ల పెళ్లి సుమలత భర్త మహేందర్ మృతి చెందిన తర్వాత, ఆమె అదే గ్రామానికి చెందిన పాండవుల సురేష్ తో గత ఐదేళ్లుగా సన్నిహిత సంబంధం కొనసాగించింది. వీరి వ్యవహారాన్ని గమనించిన గ్రామస్తులు సురేష్ ను హెచ్చరించడంతో, సుమలత అతడిని దూరం పెట్టింది. ఈ క్రమంలో మూడు నెలల క్రితం ఇంస్టాగ్రామ్ ద్వారా మరో వ్యక్తితో సుమలతకు పరిచయం ఏర్పడింది. ఈ విషయం పై సురేష్ కు అనుమానం రావడంతో ఆమెను అనుసరిస్తూ హన్మకొండకు వెళ్ళాడు. అక్కడ బస్టాండ్ సమీపంలోని యమునా లాడ్జి వద్ద మరో వ్యక్తితో కలిసి కనిపించడంతో ఆమెతో గొడవపడి కొట్టాడు. అప్పటినుంచి సుమలత పూర్తిగా దూరంగా ఉండడంతో సురేష్ లో తీవ్ర అసూయ పెరిగింది. పక్క పథకం ప్రకారం... గొంతు కోసి.. సుమలతను హత్య చేయాలని ముందుగానే నిర్ణయించుకున్న సురేష్ మే 20 న హనుమకొండకు రావాలని ఆమెను పిలిచాడు. ఇద్దరు యమునా లాడ్జిలో కలుసుకొని సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. అనంతరం వరంగల్ బస్టాండుకు చేరుకున్న తర్వాత సురేష్ తన బైక్ తీసుకొచ్చి కాశిబుగ్గ ప్రాంతంలో రోడ్డు పక్కన కత్తి కొనుగోలు చేశాడు. తర్వాత సుమలతను బైకు పై తీసుకొని లక్ష్మీపురం వైపు బయలుదేరిన సురేష్, గ్రామ శివారులోని ఎస్సారెస్పీ చిన్న కాల్వ సమీపంలో బైక్ ఆపి మాట్లాడుకుందామని నమ్మించి లోపలికి తీసుకెళ్లాడు. అక్కడ చీకటి ప్రాంతంలో ఆమెకు అనుమానం రాకుండా మాట్లాడుతూనే తన వద్ద దాచుకున్న కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు విచారణలో భాగంగా నిందితుడి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తపు మరకలు ఉన్న బట్టలు, మృతురాలి హ్యాండ్ బ్యాగ్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుడు పాండవుల సురేష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కేసు చేదనలో ప్రతిభ కనబరిచిన దుగ్గొండి సీఐ సాయి రమణ, ఎస్సై రణధీర్, కానిస్టేబుళ్లు కుమారస్వామి, అశోక్, రంజితులను ఎసీపీ అభినందించారు.
-----------------------
Reporter