సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఉపాధ్యాయ గొప్ప మేధావి, కార్యశీలి, రాజనీతిజ్ఞుడు, నిస్వార్థ సేవకుడు పండిట్ దీనదయాళ్. కొత్తగూడెంలో సోమవారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఘనంగా శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీ రంగా కిరణ్ పాల్గొని శ్రీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్ర పటానికి పూలతో నివాళి అర్పించారు. కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ యాడ్లపల్లి శ్రీనివాస్, లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షుడు పైడిపాటి రవీందర్, చుంచుపల్లి మండల అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు నాళ్ల సోమి సుందర్, ఓబిసి మోర్చా జిల్లా కోశాధికారి జల్లారపు శ్రీనివాసరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కటికాల రంజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin