సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ : పంచలోహ విగ్రహాలను దొంగలించిన వ్యక్తి అరెస్టు .... మిర్యాలగూడ DSP రాజశేకర్ రాజు... తేదీ:06-12-2024 రాత్రి 9.30 మరియు 11.30 మధ్యలో ఒక గుర్తు తెలియని దొంగ శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం గర్భగుడి గ్రీల్స్ కు వేసిన ఉన్న తాళం పగులగొట్టి, గుడి లోగల పంచలోహ ఉత్సవ విగ్రహలు పార్వతి, శంకరుడు, చండీశ్వరుడు, పార్వతీ మూలవిరాట్ షఠారం, మరియు రెండు బంగారు పుస్తెలు 4 గ్రాములు గలవాటిని దొంగిలించుకొని పోయినారని ఇచ్చిన దరఖాస్తు పైన క్రైమ్ నెంబరు 442/2024 U/S 331(4),305 BNS లో కేసు నమోదు చేసి జిల్లా ఎస్.పి శ్రీ శరత్ చంద్ర పవర్ గారి ఆదేశాలమేరకు డి.ఎస్.పి రాజశేకర్ రాజు గారి పర్యవేక్షణలో మిర్యాలగూడ సి.ఐ కె. వీరబాబు మరియు మిర్యాలగూడ రూరల్ ఎస్.ఐ పి. లోకేశ్ గారు పరిశోదన ప్రారంభించినారు... కేసు యొక్క దర్యాప్తు లో భాగముగా గుడి దగ్గరలో బిగించి ఉన్న C.C కెమెరా లను పరిశీలిచి గుడిలో దొంగతనమునకు పాల్పడిన వ్యక్తి ఆనవాళ్లతో నిఘా ముమ్మరం చేసి నారు. నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు 08-12-2024 నాడు తెల్లవారుఝామున 5.00 గంటలకు ఆలగడప టోల్-గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, గణేశ్ నగర్ శివాలయం దేవాలయం లో దొంగిలించిన విగ్రాహలు, రెండు పుస్తెలు అన్నీ తెల్లని బస్తా సంచిలో కనబడకుండా పండ్ల ట్రే లో పెట్టుకొని నెంబరు లేని TVS XL బండి పై కోదాడ వైపుకు వెళ్తున్న వ్యక్తిని పట్టుబడి చేయడం జరిగినది. నిందితుడి వివరాలు: బీబాద్ద మంజీత్ సింగ్, తండ్రి: మాన్ సింగ్, 24 సం.లు, స్వగ్రామము:రాజీవ్ కాలనీ, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. ప్రస్తుతం బాపూజీనగర్-మిర్యాలగూడ. ఇతని అత్తగారిది బాపూజీ నగర్-మిర్యాలగూడ. ఇతను అత్తగారింటికి వచ్చి పోతూ గతములో ఆగస్టు నెలలో యాదగిరి పల్లి గ్రామ శివారు లో గల శ్రీ పార్వతీ సమేత ఆగస్తేశ్వర స్వామి దేవాలయం లో రాత్రి వేళ గుడి తలుపు తాళాలు పగుల గొట్టి (4) అమ్మవారి చీరలు దొంగిలించుకొని పోయినాడు. మరలా గత 15 రోజుల నుండి ఇక్కడే ఉంటూ గణేశ్ నగర్ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి గుడిలో దొంగతనం చేసినాడు. ఇట్టి కేసును 24 గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితుని పట్టుబడి చేసి, పూర్తిగా కేసు ప్రాపర్టీ ని స్వాదిన పర్చుకున్న విషయంలో CI K.వీరబాబు గారిని, SI P.లోకేశ్, ASI డి.రాములు నాయక్, పిసి 3157 M.సైదా నాయక్, PC3074 శంకర్ లను మిర్యాలగూడ DSP రాజశేఖర్ రాజు గారు అభినందిచడం జరిగినది. మిర్యాలగూడ 1 వ పట్టణ పోలీసు పరిధి ఇందిరమ్మ కాలనీలో తేదీ 04-12-2024 నాడు మధ్యహన్నం ప్రాంతంలో జరిగిన దొంగతనములో 1,80,000/- నగదు పోవడం జరిగినది. దీనిని 1 వ పట్టణ పోలీసు వారు 24 గంటలలో ఛేదించి 1,79,000/- నగదు రికవరీ చేసినారు. ఈ విషయమై మిర్యాలగూడ 1 టౌన్ సిఐ గారిని, SI సుధీర్ కుమార్, కానిస్టేబుల్ శ్రీనివాస్, హాలియా PS రవికుమార్ లను మిర్యాలగూడ DSP రాజశేఖర్ రాజు గారు అభినందిచడం జరిగినది.
-----------------------
Admin