సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఎన్నికల కోడ్ దృష్ట్యా హుజూర్ నగర్ ఎక్సైజ్ సిబ్బంది మేళ్లచెరువు,చింతలపాలెం, మఠం పల్లి పల్లి మండలాల్లో నిర్వహించిన దాడులలో ఒక ద్విచక్ర వాహనం తో పాటు సారా స్వాధీనం చేసుకొని పలువురి ని అరెస్ట్ చేశారు. చింతలపాలెం మండలం ఎర్రకుంట తండా కు చెందిన అంగోతు గోపి మరియు పద్య ప్రసాద్ లు రఘునాథ పాలెం కు 6 లీటర్ల సారా తరలిస్తుండగా సారా పాటు హీరో స్ప్లెండర్ బండి ని సీజ్ చేశారు.చింతలపాలెం మండలం ఎర్రకుంటతండా కి చెందిన గుగులోతు రమేష్ ఇంటి నుండి 5 లీటర్ల సారా,200 కిలో ల బెల్లం తో పాటు,800 లీటర్ల బెల్లం వాష్ ను స్వాధీనం చేసుకొని ఆ వ్యక్తి పై కేస్ నమోదు చేయడమైనది.ఇట్టి దాడులలో ఎస్ ఐ లు , జగన్మోహన్ రెడ్డి,దివ్య .. సిబ్బంది నాగరాజు, రుక్మ రెడ్డి, నరేష్, దనుంజయ్ లు పాల్గొన్నారు...
-----------------------
Admin