Wednesday, 29 July 2026 05:44:26 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రైతును రాజు చేయటమే మా ప్రభుత్వ లక్ష్యం - మంత్రివర్యులు సీతక్క

Date : 04 March 2024 08:29 AM Views : 376

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : త్వరలో రైతు కమిషన్ ఏర్పాటు చేస్తాం!! పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను భుజాలపైన మోస్తాం!! పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి!! భోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు పాలకవర్గం ప్రమాణస్వీకారం సభలో రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క తెలంగాణలో రైతులని రాజులను చేసే ప్రక్రియ కొనసాగుతుందని, త్వరలో రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతు రుణ విముక్తి దారుణ చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముందున్న ప్రధాన లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, శ్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు సీతక్క పేర్కొన్నారు స్థానిక ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన బోత్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం లో పాల్గొని నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గానికి శాలువాలతో సన్మానించారు ముందుగా ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు నూతన పాలకవర్గంతో ప్రమాణస్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు అనంతరం జరిగిన సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ అధికారంలో లేనప్పుడు పార్టీ జెండా మోసి కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు లభిస్తోందని, దానికి నిదర్శనమే బోత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి అని పేర్కొన్నారు ప్రజల్లో ఉండండి ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బోజ్జు నూతనంగా ఎన్నుకోబడ్డ పాలకవర్గం అనునిత్యం రైతాంగ సమస్యల మీద, రైతులకు గిట్టుబాటు ధర లభించే విధంగా దళారులు నష్టపరచకుండా రైతులందరికీ అందుబాటులో ఉండాలని, పార్టీలో కూడా క్రియాశీలకంగా ప్రజల్లో పనిచేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ ఆర్ గ్యారంటీలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లి కష్టపడి పని చేయాలని సూచించారు సీతక్క నోట భోథ్ రెవెన్యూ డివిజన్ మాట రాష్ట్ర వ్యాప్త దేశవ్యాప్త సమస్యలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తామని రానున్న కేబినెట్ మీటింగ్లో బోథ్ రెవెన్యూ డివిజన్, సోనాల మండల ఏర్పాటు, ఫైర్ స్టేషన్, డిగ్రీ కళాశాల ఇన్చార్జి మంత్రిగా కేబినెట్ ముందు ఉంచుతానని భరోసా ఇచ్చారు బిఆర్ఎస్ బిజెపిలో ఒకే తాను గుడ్డలని నూతన వ్యవసాయ చట్టాలు అమలు చేస్తూ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని వారి పార్టీలో వ్యక్తిగత జీవితం మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద ప్రజా సమస్యల మీద చూపించాలని బిఆర్ఎస్ బిజెపి నాయకులకు సూచించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం, భోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆడే గజేందర్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేష్, తెలంగాణ కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ అడ్డీ బోజారెడ్డి, ఆదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భూపల్లీ శ్రీధర్, కిసాన్ సెల్ రాష్ట్ర నాయకులు బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రపూల్ రెడ్డి, మహమూద్ ఖాన్, తలమడుగు మండల ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, జడ్పిటిసి సభ్యులు మల్లెపూల నరసయ్య, కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ యూత్ కాంగ్రెస్ కిసాన్ సెల్ ఫిషరీస్ , భోథ్ నియోజకవర్గ అన్ని మండలాల అధ్యక్షులు ముఖ్య నాయకులు, ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు రైతులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: