సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : ఈ దేశ ప్రజల ప్రజాస్వామ్య రక్షణ కోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించి సకల జనులకు సర్వహక్కులను ప్రసాదించి బాధ్యతలను అప్పజెప్పి మార్గదర్శిగా నిలిచిన అంబేద్కర్ భారతీయ సమాజానికి స్ఫూర్తి ఆరాధ్యుడని మాదిగ సంఘాల మహాకూటమి నాయకులు పోలేపల్లి ఉదయ్ కుమార్,పోకల రవికుమార్ అన్నారు. దామరచర్ల లో గురువారం ఉదయం పార్లమెంటులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన తీరును నిరసిస్తూ మాదిగ సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు దామచర్లలో గురువారం అద్దంకి నార్కెట్ పల్లి జాతీయ రహదారి పై సుమారు నాలుగు గంటల పాటు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాదిగ సంఘాల మహాకూటమి జిల్లా ఇన్చార్జులు పోలేపల్లి ఉదయ్ కుమార్, పోకల రవికుమార్,మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా ఒంటినిండా మనువాద భావజాలాన్ని నింపుకొని అంబేద్కర్ ని అవమానకరంగా మాట్లాడడం ఈ దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని వారన్నారు.ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు హక్కుల పరంగా బాధ్యతల పరంగా రక్షణలను కల్పిస్తూ వారి ఎదుగుదల కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సర్వోన్నతమైనదని అది జీర్ణించుకోలేని మనువాద పాలకులు కులాధిపత్య,మతాధిపత్య భావజాలాన్ని విస్తరింప చేయడానికి సమ సమానత్వాన్ని ఆకాంక్షించిన అంబేద్కర్ ని విస్మరిస్తున్నారని ఇది భారత రాజ్యాంగ ఆకాంక్షలకు వ్యతిరేకమని వారన్నారు. అసమానతలను అస్పృశ్యతులను సృష్టించడమే పనిగా ఈ మతోన్మాద పాలకులు పెట్టుకున్నారని వారన్నారు. ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు అంబేద్కర్ ని సర్వోన్నతమైనటువంటి మేధావిధిగా కీర్తిస్తుంటే మన దేశ పాలకులు మాత్రం తులనాడుతున్నారని అవేధన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ దేశ ప్రధానమంత్రి కేంద్రమంత్రి మోడీ అమిత్ షాలు ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే అమిత్ షా రాజీనామా చేయాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మండల అధ్యక్షులు కొమ్ము రాజేష్ మాట్లాడుతూ ఈ దేశ ప్రజలు జీవించడానికి కావలసినటువంటి జీవించే హక్క, స్వేచ్ఛ, సమానత్వం,సౌబ్రాతృత్వం,సామాజిక న్యాయం ఇలా అనేక రకాలైన ప్రజాస్వామిక విలువలను అందించిన మహనీయుడు అంబేద్కర్ ని "స్మరించడం" ఏ నేరం కిందికి వస్తుందో అమిత్ షా రుజువు చేయాలన్నారు. అంబేద్కర్ శాస్త్రీయమైన ఆలోచన లను అమలు చేయకుండా అశాస్త్రీయమైన మనువాద భావజాలాన్ని పదేపదే పార్లమెంట్ లో ప్రస్తావించడం అమిత్ షా అనాగరికమైన ఆలోచనలకు నిదర్శనం అన్నారు.అంబేద్కర్ ప్రచురుణలను పదేళ్లు గా ముద్రించకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యమే అంబేద్కర్ పట్ల వాళ్లకు ఉన్న అక్కసుకు నిదర్శనం అన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని అంబేడ్కర్ ఆలోచనలను విస్తరింప చేయాలనే చిత్తశుద్ధి ఈ పాలకులకు ఉంటే ఏ మేరకు అంబేద్కర్ పేరు పైన పథకాలను తీసుకొచ్చారో, ఎన్నిసార్లు అంబేడ్కర్ గురించి పార్లమెంట్ లో ప్రస్తావించారో ఈ దేశ ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కనుమరుగు చేయడంలో భాగంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా పౌర సమాజం భావిస్తుందన్నారు.తక్షణమే అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాదిగ సంఘాల మహాకూటమి ప్రముఖులు గౌరవ అధ్యక్షులు యాoపొoగు ప్రసాద్, యాంపొంగు శ్రీధర్, కొమ్ము రమేష్, గద్దల శ్రీను, గద్దల భూరాజు, పోలేపల్లి లక్ష్మయ్య, పోలేపల్లి భాస్కర్, పోలేపల్లి రాజశేఖర్,అక్కినపల్లి సైదులు, మంద వెంకటేశ్వర్లు, సందాల లక్ష్మణ్, పరంగి నాగ మహేష్, కలిమెళ్ళ కిషోర్, సందాల వెంకటేశ్వర్లు, కొమ్ము గౌతమ్,ఎరుకల సంఘం నాయకులు భూజ యోను తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin