Thursday, 30 July 2026 10:23:59 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖానాపూర్ కేజీబీవీను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

Date : 17 October 2025 08:05 PM Views : 300

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట వరంగల్/ ఖనాపూర్: 17 అక్టోబర్ 2025 వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్, వంట గది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. భోజన నాణ్యతను పరిశీలించి, కూరల రుచిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనును ఖచ్చితంగా పాటించాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. కేజీబీవీ లో విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన తలుపులు, ఇనుప గ్రిల్స్, టాయిలెట్ల మనమ్మత్తులను, ఆరో ప్లాంట్, కిచెన్ రూఫ్ తదితర పూర్తయిన పనులను కలెక్టర్ పరిశీలించారు. కోతులు వస్తున్నాయని ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కోతులు రాకుండా వెంటనే మెష్ ఏర్పాటు చేయాలని డీఈ ను ఆదేశించారు. వారంలో ఒకరోజు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ డేగా నిర్ణయించి ఆరోజు పిల్లలతో అదే భాష రోజు మొత్తం మాట్లాడించాలని, దీనితో వారి వకాబులరీ పెరుగుతుందన్నారు . విద్యార్థులతో ముచ్చటించి వారి పట్టణ సామర్థ్యాన్ని తెలుసుకొని ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. విద్యార్థులకు ఏమన్నా సమస్యలు ఉంటే ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ లో వేయాలన్నారు. క్రీడల కొరకు వాలీబాల్ బాస్కెట్బాల్, ఖో ఖో కోర్టులు కావాలని విద్యార్థులు కలెక్టర్ ను కోరగా, తగు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. తహసిల్దార్ రమేష్, టిఈడబ్ల్యూఐడిసి డిఈ అశోక్, జి ఈ సి ఓ ఫ్లోరెన్స్, ఎం ఈ ఓ శ్రీదేవి స్పెషల్ ఆఫీసర్ మేనక, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :