సర్కార్ టీవీ న్యూస్ / యన్.టి.ఆర్ జిల్లా : తనకల్లు మండలం, బొంతలపల్లి గ్రామానికి చెందిన ఇంటర్మీడియట్ చదువుతున్న సంధ్యారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ విధితమే. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకుగాను రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి కె.వి ఉషశ్రీ చరణ్ మరియు కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుతున్న సంధ్యారాణి ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన ఇంతియాజ్ చేతిలో రకరకాలైన వేధింపులకు, బెదిరింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న ఇలాంటి దుర్మార్గపు పనులకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలన్నారు. నిన్నటి దినం జరిగిన సంధ్యారాణి ఆత్మహత్య కు చంద్రబాబు నాయుడు పూర్తి బాధ్యత వహించాలన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు చేపడతామని, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆ కుటుంబానికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని, అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంధ్యారాణి కుటుంబాన్ని ఓదార్చేందుకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి విచ్చేసి, ఆ కుటుంబానికి అన్ని విధాల ధైర్యాన్ని అందించారన్నారు. ఒక బిడ్డను కోల్పోయిన ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకూడదని కోరుకుంటూ, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామన్నారు. వీరితోపాటు స్థానిక మండల కన్వీనర్ మధుసూదన్ రెడ్డి, కోక్కంటి శ్రీనివాసులు నాయుడు, ఎంపీటీసీ చలపతి, వైస్ సర్పంచ్ శివన్న, టెంపుల్ కమిటీ చైర్మన్ గోపాలకృష్ణ, చంద్రమౌళి రెడ్డి, కొండా మల్లికార్జున, నీలకంఠ రెడ్డి, రాం దేశాయ్. మాజీ ఎంపిటిసి వేమనారాయణ, బాబా ఫక్రుద్దీన్, కృష్ణారెడ్డి, , శివన్న, అశ్వర్థ, హరినాథ్ రెడ్డి, నాగరాజు, అయూబ్, తదితరులు పరామర్శించారు.
-----------------------
Admin