సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : మునిసిపల్ ఎన్నికల్లో ప్రధాన ఘట్టం నామి నేషన్ల స్వీకరణ శుక్రవారం సాయంత్రం ముగి సింది. కానీ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రక టించలేదు. చాలా డివిజన్లలో పోటీ అధికంగా ఉండటంతో అభ్యర్థులను ఖరారు చేయకుండా, నామినేషన్‌ల గడువు ముగిసేవరకు రెండు పా ర్టీలు వేసిన రాజకీయ ఎత్తుగడ సక్సెస్ అయిం ది. అభ్యర్థుల పేర్లు ముందే ప్రకటిస్తే, టికెట్ రాని వారు ఇతర పార్టీల నుంచి పోటీకి దిగుతా రన్న ఉద్దేశంతో చివరి వరకు పేర్లు ప్రకటించ కుండా దాటవేత దోరణి అవలంభించాయి. అయితే చాలా మంది అభ్యర్థులకు మాత్రం నామినేషన్‌లు వేసుకోవాలని ముఖ్య నాయకులు సూచనప్రాయంగా చెప్పారు. టికెట్ వస్తుందన్న ధీమా ఉన్నా, బీఫామ్ సమర్పించేందుకు మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉండటం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. అప్పటివరకు రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో? ఎవరు ఎలాంటి పైరవీలు చేస్తారోనన్న భయం లోలోన ఉంది. ఫిబ్రవరి 3వ తేదీ లోగా పార్టీలు బీఫారంలు సమర్పించేందుకు గడువు ఉండటం తో ప్రధాన పార్టీలు అదే రోజు సమర్పించాలన్న ఆలోచనలో కనిపిస్తున్నాయి... కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయ డం నాయకులకు సవాల్‌గా మారింది.
-----------------------
Admin