సర్కార్ టీవీ న్యూస్ / మహబూబ్ నగర్ జిల్లా : మహబూబ్ నగర్ / తెలంగాణ ప్రభుత్వంలో ఆడపిల్లలకు ప్రాధాన్యత పెరిగిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సమాజంలో ఆడ, మగా తేడా లేదని, అందరూ సమానమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం మహిళల్లో ధైర్యం, విశ్వాసాన్ని, భరోసాను కల్పించిందని, మహిళా సంక్షేమంలో భాగంగా అనేక పథకాలను అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా మహిళల సంక్షేమంలో భాగంగా పౌష్టికాహారం, పిల్లలకు బాలామృతం, స్కానింగ్ సెంటర్లు, కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్, వివిధ పథకాల కింద పట్టాలను మహిళల పేరు మీద ఇస్తున్నామని, అంగన్వాడీ వర్కర్లను టీచర్లుగా మార్చామని, ఆయాలను హెల్పర్లుగా నియమించి వారి గౌరవంతో పాటు, గౌరవ వేతనాన్ని కూడా పెంచామని, మహిళల కోసం షీ టీమ్స్, రక్షణ చట్టాలను ఏర్పాటు చేయడమే కాకుండా ,వాటిని కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం మహబూబ్నగర్లోని శిల్పారామం లో నిర్వహించిన మహిళ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు మహబూబ్నగర్లో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేదని ,నీటికోసం మహిళల పడ్డ కష్టాలు మరువలేని అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం రాకముందు 200 రూపాయల పెన్షన్ వస్తే ఇప్పుడు 2000 రూపాయలు ఇస్తున్నామని, అలాగే వికలాంగులకు ఇస్తున్న 3000 రూపాయలను రూ.4016 కు పెంచామని, వితంతులు,బీడీ కార్మికులు,వంటరి మహిళలకు పెన్షన్లు ఇస్తున్నామని, దేశంలో ఎవరు ఇంత మొత్తంలో పెన్షన్లు ఇచ్చినవారు లేరని, ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారి ఇంత మొత్తంలో పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. సమాజంలో 99% ఆడపిల్లలే తల్లిదండ్రులను బ్రతికించుకుంటున్నారని, ఆడపిల్ల దైవంతో సమానమని ఆయన అన్నారు. తల్లి బిడ్డను కనేందుకు ఎన్ని కష్టాలు పడిందో తర్వాత కూడా అన్ని కష్టాలు పడుతుందని, అలాంటి తల్లుల కోసం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు తీసుకురావడం జరిగిందని ఆయన తెలిపారు .మహిళల కోసం మరిన్ని పథకాలను ఆమలు చేసి వారి సంక్షేమాన్ని కృషి చేస్తా మని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ జి .రవి నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింలు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, వైస్ చైర్మన్ గణేష్, ఎంపీపీ సుధా శ్రీ, వైస్ ఎంపీపీ అనిత ,జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి మధుసూదన్ గౌడ్, ఎల్ డి ఎం భాస్కర్ ,జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, బి సి వెల్ఫేర్ అధికారి ఇందిర, సి పి ఓ దశరథం,మత్స్య శాఖ ఏ డి రాధా రోహిణి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సిడిపిఓ శైలశ్రీ, కౌన్సిలర్లు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు .
-----------------------
Admin