Monday, 14 September 2026 03:05:16 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీ.ఆర్.ఎస్ ఆవిర్భావ సభకు పటిష్ట ఏర్పాట్లు...

Date : 18 January 2023 12:54 AM Views : 811

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : నేడు జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కోసం పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు దగ్గరుండీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బహిరంగసభకు భారీగా తరలివచ్చే కార్యకర్తలకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా. మొత్తం సభా ప్రాంగణం పరిసరప్రాంతాల్లో సుమారు 480 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని10 నియోజకవర్గాలు, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోని 8 నియోజకవర్గాల నుంచి. వేలాది వాహనాల్లో కార్యకర్తలు వస్తుండటంతో పార్కింగ్, ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పార్కింగ్ స్థలాలు గుర్తించారు. ఆ స్థలాలను చదును చేస్తున్నారు. ఆ సభకు 30, 000 నుంచి 50, 0000 వాహనాలు వస్తాయని అంచనావేస్తున్నారు. ఏ దారినుంచి వచ్చే వాహనాలకు అదే దారిలో సభాస్థలికి కిలోమీటరు దూరంలోనే ఆపేలా స్థలాలు గుర్తించారు. నియోజకవర్గాల వారీగా పార్కింగ్కు క్యూఆర్ కోడ్ కేటాయిస్తున్నారు. బహిరంగ సభకు వివిధ జిల్లాల నుంచి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు రానున్నారు. సుమారు 15, 000 వీఐపీ పాసులు సిద్ధంచేస్తున్నారు. సభావేదికకు ముందు. 20, 000 కుర్చీలను ప్రముఖుల కోసం కేటాయించారు. మహిళల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు వెయ్యిమంది వాలంటీర్లు అందుబాటులో ఉంచనున్నారు. సభాస్థలి చుట్టూ మొబైల్ టాయ్లెట్స్ సహా మైదానం ఎల్ఈడీ తెరలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. బహిరంగ సభను పక్కాగా జరిపేందుకు బీఆర్ఎస్ పలు కమిటీని నియమించింది. పార్కింగ్ కమిటీకి ఎమ్మెల్సీ తాతా మధు, సభా వేదిక నిర్వహణకు సీనియర్ నేత గ్యాదరి బాలమల్లు వ్యవహరిస్తారు. మీడియా కోఆర్డినేషన్ కమిటీ బాధ్యులుగా టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ శ్రీధర్రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్జేసీ కృష్ణను నియమించారు. నలుగురు ముఖ్యమంత్రులతోపాటు జాతీయ నాయకులు, లక్షలాది జనం తరలివస్తున్న ఈ బహిరంగ సభకు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. వివిధ జిల్లాల నుంచి దాదాపు 5, 000 మంది పోలీస్ అధికారులు, సిబ్బందిని రప్పిస్తున్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :