సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో సూర్యాపేట జిల్లా రబ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ పాఠశాల ఆవరణలో ఒలంపిక్ డే రన్ ను ప్రారంభించిన మన్నెం శ్రీనివాస్ రెడ్డి , సెయింట్ ఆన్స్ సిస్టర్స్ రూబీ ,సుజాత లు ముందుగా ఒలంపిక్ ఫ్లాగ్ ను ఎగరవేసి జాతీయ స్థాయిలో సత్తా చాటినటువంటి రబ్బి క్రీడాకారులను సన్మానించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలు కూడా రోజువారి కార్యక్రమంలో చేర్చుకోవాలని క్రీడల వలన ఒత్తిడిని తగ్గించుకొని చదువులో బాగా రాణించవచ్చని తెలిపారు. క్రీడల వలన ఫిట్ గా ఉండొచ్చని దాని ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని క్రీడలకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రిన్సిపల్ సిస్టర్ సుజాత మాట్లాడుతూ ఒలంపిక్స్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, మా స్కూల్లో ఈ యొక్క ఒలంపిక్ డే రన్ నిర్వహించడం చాలా సంతోషదాయకమని మేము ఆహ్వానించగానే ఇక్కడికి 400 మంది క్రీడాకారులు రావడం ఒలంపిక్ డే రన్ కార్యక్రమంలో పాల్గొనడం క్రీడా స్ఫూర్తికి నిదర్శనం అని స్పోర్ట్స్ డెవలప్మెంట్ కోసం ఇంకా పెద్ద ఎత్తున వివిధ రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తామని ఈ యొక్క ఒలంపిక్ డే రన్ లో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, మాన్ ఫోర్ట్ స్కూల్, సెయింట్ ఆన్స్ స్కూల్ , మరియు ఇతర పాఠశాల నుండి సుమారు 400 మంది క్రీడాకారులు ఈ యొక్క ఒలంపిక్ రన్ లో పాల్గొనడం జరిగింది. సెయింట్ ఆన్స్ స్కూల్ నుండి మొదలై మెయిన్ రోడ్డు వరకు వెళ్లడం జరిగిందని, ఈ యొక్క రన్ లో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా రబ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్నాటి తరుణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ కొండేటి సుధాకర్ రెడ్డి, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు బాల రెడ్డి , వ్యాయామ ఉపాధ్యాయులు జయ, సతీష్, శ్రీను, స్వర్ణ, నాగరాజు, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin