Wednesday, 29 July 2026 08:19:35 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిసి డిక్లరేషన్ కమిటీ సమావేశంలో బిసి డిక్లరేషన్ సభ సభ్యులు నాగ సీతారాములు...

Date : 07 September 2023 07:44 AM Views : 350

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ గాంధీభవన్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఇవ్వబోయే ప్రాధాన్యతపై సభ పెట్టి బీసీ డిక్లరేషన్‌ ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీసీల సమస్యలపై చర్చ జరిపి వాటిపై డిక్లరేషన్ సభ ద్వారా భరోసా కల్పించాలని బిసి డిక్లరేషన్ సభ నిర్వహిస్తున్న వేళ చైర్మన్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో గాంధీభవన్ లో బీసీ డిక్లరేషన్‌ సమావేశం నిర్వహించారు. డిక్లరేషన్ లో ప్రకటించాల్సిన అంశాలపై సూచనలు, సలహాలను ఇవ్వాలని ప్రభాకర్ కోరారు. ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు, డిక్లరేషన్ కమిటీ సభ్యులు నాగా సీతారాములు మాట్లాడుతు బిసి డిక్లరేషన్ సభలో బడుగు బలహీన వర్గాలైన బీసిలకు సంబంధించిన అందరికి చేయబోయే సంక్షేమాన్ని, వారికి అందిచబోయే అభివృద్ధి గురించి స్పష్టం చేయగలిగితే బాగుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో బిసిల కోసం ఎం చేసింది ఇప్పుడు ఎం చేయబోతుందో చెప్పాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ లకు అసెంబ్లీ, పార్లమెంట్, రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చి రాజ్యాధికారం దక్కేలా చూడాలన్నారు. బీసీ లోని అన్ని కులాలకు చెందిన ప్రజలకు భరోసా కల్పించాలని, కుల జనగణన జరిపి వారికి సంక్షేమ పథకాల్లో సమాన వాటా ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను మార్పులు చేశారే తప్ప కొత్తగా ఏవి అందుబాటులో తీసుకురాలేదన్నారు. దళిత, గిరిజనుల కోసం ఏవైతే పథకాలు అందించనున్నారో అలానే బీసీల కోసం కూడా అమలు చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. బీసీ సంక్షేమం, రాజకీయ ప్రధాన్యతపై సిఫార్సులు చేయాలని కోరారు. గాంధీభవన్లో జరిగిన బిసి డిక్లరేషన్ కమిటీ సమావేశంలో మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్ గౌడ్, మధుయాష్కి గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్, కుమార్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు జకారం శేకర్, అశోక్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :