సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట. నర్సంపేట డివిజన్ సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నిర్మించుటకు శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ స్థలాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ దాదాపు 28 కోట్ల రూపాయలతో నర్సంపేట డివిజన్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాలు రెవెన్యూ డివిజనల్ అధికారి, తహసిల్దార్, ఎంపీడీవో, ఏడిఏ, ఎంఈఓ, సబ్ రిజిస్టర్ ఇతర ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటిని ఒకే చోట నిర్మాణం చేసి ప్రజలకు అన్ని కార్యాలయాలు ఒకే చోట అందుబాటులో ఉండే విధంగా సౌకర్యం కల్పించనున్నామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కత్తి కిరణ్ నాయకులు పెండెం రామానంద్, దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Reporter