Sunday, 13 September 2026 12:54:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తెలంగాణా వచ్చినాక 12% రిజర్వేషన్ పేరుతో మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ... - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి.

Date : 23 November 2023 07:33 AM Views : 290

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం పుల్చెర్ల కుంట తండాకు సంబందించిన యువత లింగం నాయక్, శ్రీను నాయక్ అధ్యక్షతన బిజెపి చేరారు. ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జి సూర్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్, పాతపల్లి కృష్ణా రెడ్డి, మనోహర్ రెడ్డి వారిని కండువాతో బిజెపి లోకి స్వాగతించారు. ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పరిపాలన లో గిరిజన తండాల అభివృద్ధి లేక, సరైన వసతులు లేక ఎంతో ఇబ్బందులపాలయ్యారని అన్నారు. అదేవిదంగా తొమ్మిదిన్నర ఏళ్లలో గిరిజన తండాలు అభివృద్ధి చేయడం లో టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. ఎన్నికలప్పుడే ఓట్ల కోసం గిరిజనబంధు గుర్తుకొస్తుందని విమర్శించారు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అని చెప్పి ఇవ్వలేదని విమర్శలు గుప్పారు. గిరిజన మహిళ ధ్రౌపతి ముర్ము గారిని రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీదే అని అన్నారు. గిరిజనుల కోసం సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఇచ్చారని అన్నారు. తాండలలో వీధి లైట్లు, సీసీ రోడ్లు వివిధ అభివృద్ధి పనులు కేంద్రప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు. గిరిజన తండాల అభివృద్ధి బిజెపి తోనే సాధ్యమని, గిరిజన తాండాల సమగ్ర అభివృద్ధి కి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ ఇచ్చే అబద్దపు హామీలను నమ్మి మోసపోవద్దని అన్నారు. నవంబర్ 30 న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులు బిజెపికి మద్దత్తు ఇవ్వాలని, అందె బాబయ్యని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఇందులో భాగంగా గోవింద్ నాయక్, వినోద్ నాయక్, మురళి నాయక్, పవన్ నాయక్, ఎం వినోద్ నాయక్, నరేష్ నాయక్, సురేష్ నాయక్, కుమార్ నాయక్, ప్రభాకర్ నాయక్, ప్రకాష్ నాయక్, శివ నాయక్, వీరేష్ నాయక్, అర్జున్ నాయక్, సురేష్ నాయక్ తదితరులు పార్టీ లో చేరారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: