సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ : పాల్వంచ మండలం మరియు పట్టణంలో అసైన్మెంట్, ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు, వెంచర్లు, జిల్లా రికార్డు స్థాయిలో అక్రమార్కుల ఆగడాలకు హద్దు అదుపులేకుండా పోయింది... అధికారుల కళ్ళముందే యథేచ్ఛగా బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్న అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు ఎందుకు..? భవన నిర్మాణ అనుమతులు లేవు, ఆసుపత్రి నిర్వహణకు కావలసిన ఫైర్ సేఫ్టీ లేదు, పార్కింగ్ సౌకర్యం లేదు కానీ మంత్రులు, ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేస్తే చాలు. ఎటువంటి అనుమతులు అవసరం లేదు అనేది నగ్న సత్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులు నిరూపిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు... పాల్వంచ మండల పరిధిలోని 444, 727, 817, 999 ప్రభుత్వ సర్వే నెంబర్లలో అనేక అక్రమ కట్టడాలు, వెంచర్లు వేస్తున్న అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. పట్టణ నడిబొడ్డున దమ్మపేట సెంటర్ నుండి శ్రీనివాస కాలనీ కి వెళ్ళే దారిలో 817 ప్రభుత్వ సర్వే నెంబర్ లో ఎటువంటి అనుమతులు లేకుండా మూడంతస్తుల భవనం నిర్మాణం చేపట్టి శ్రీ విజయ నర్సింగ్ హోమ్ పేరుతో ఒక ప్రైవేట్ వైద్యశాలకు కిరాయికి ఇచ్చారు. ఆసుపత్రికి ప్రారంభోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే, ఉమ్మడి జిల్లా మంత్రి హాజరై ప్రారంభించారు... ఇక అంతే సంగతి ఎటువంటి అనుమతులు అవసరం లేదు. యథేచ్ఛగా ఆసుపత్రి నిర్వహణ చేసుకోవచ్చు అడిగే వాడు లేడు అన్న సిద్ధాంతం పాల్వంచ పట్టణంలో జరుగుతుంది. 817 సర్వే నెంబర్ లో ఇప్పటికీ అక్రమ కట్టడాలు వెంచర్లు జరుగుతున్నాయి. అధికారులు ప్రజాప్రతినిధులకు తలొగ్గకుండా చర్యలు తీసుకుంటే ఎంతో విలువైన భూములను కాపాడుకోవచ్చు అని ప్రజలు అంటున్నారు. 817 సర్వే నెంబర్ లో అనేక అక్రమ కట్టడాలు... ప్రభుత్వ భూముల్లో ఇదే తరహాలో అనేక అక్రమ కట్టడాలు వెలిశాయి. అధికారులు వారికి వంత పాడుతూ అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వకుండానే వంత పాడుతుండడం వెనుక అసలు రహస్యం ఏమిటి..? అని ప్రజలు ఆరా తీస్తున్నారు.పెద్ద మొత్తంలో ముడుపులతో పాటు అధికార పార్టీ నాయకుల ఒత్తిడి కూడా ఉంటుందని ప్రజల గుసగుసలు... ఈరోజు అనుమతులు లేని ఆసుపత్రి ప్రారంభోత్సవం కనిపిస్తుంది అని ప్రజలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. 444 సర్వే నెంబర్ లో సుమారు 30 ఎకరాల్లో భారీ స్థాయిలో ఇరిగేషన్ పరిధిలోని వంతెనను కూడా కలుపుకొని నిర్మించిన రిసార్ట్ లకు ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల సహాయ సహకారాలు ఉన్నట్లు సృష్టించారు. ఆ బడా వ్యాపారి మంత్రులను సైతం తప్పుదోవ పట్టించి పట్టణ పరిధిలో అనేక ప్రభుత్వ, ఇరిగేషన్ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మించి, సొమ్ము చేసుకుంటున్న తీరు ప్రజలను కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి.... గతంలో అధికారులు కూల్చిన భవనాలను కూడా పునరుద్ధరించి వ్యాపారం చేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవాలకు వచ్చే ముందు పూర్తి సమాచారం సేకరించి అన్ని అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకొని వస్తే బాగుంటుంది అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు...వారి అంగ, ఆర్థిక బలానికి లోనై వస్తే ప్రజల్లో తీవ్ర విమర్శలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మేధావులు హితవు పలికారు..! అసైన్మెంట్ భూముల విషయంలో ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగారుస్తున్న అధికారులు... ప్రభుత్వం పేదల జీవనోపాధి కోసం ఆలోచన చేసి వ్యవసాయం చేసుకుని ఆర్థిక అభివృద్ధి చెందుతారని, తద్వారా పేదరిక నిర్మూలన సాధ్యం అవుతుంది అని భావించి పేదల బతుకుల బాగు కోసం ప్రభుత్వ భూములను అసైన్మెంట్ చేసి పేదలకు పట్టాలను అందించింది. ఈ భూములను రైతులు అమ్ముకునే అవకాశం ప్రభుత్వం కల్పించలేదు కేవలం జీవనోపాధికి మాత్రమే వినియోగించుకునేలా అవకాశం కల్పించిన విషయం అందరికీ తెలిసిందే కానీ...! కొంత మంది అక్రమార్కులు ధనార్జనే ధ్యేయంగా పేదల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి కొంతమంది కబ్జాలు చేసి మరీ కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మించి భారీ స్థాయిలో వ్యాపారాలు సాగిస్తున్నారు. నిమ్మకు నీరెత్తని అధికారులు... పాల్వంచ పట్టణంలోని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కళ్ళముందే ఈ తతంగం అంతా జరుగుతున్న పలు పత్రికల్లో వార్తలు వచ్చినా నేరుగా సమాచారం అందించినా ఇవేవీ వారికి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోయి మరీ ప్రభుత్వ భూముల్లో అక్రమ వెంచర్లు వేసి అమాయకులను మోసం చేసి భారీగా దండుకుంటున్నారు. అక్రమార్కుల తెగింపుకు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారులే కారణం... అక్రమార్కుల తెగింపుకు పాల్వంచ రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పాటు ప్రభుత్వ ప్రతినిధులే కారణమని పాల్వంచ ప్రజలు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. అక్రమార్కుల నుంచి భారీ స్థాయిలో ముడుపులు అందుకుంటున్నారని ప్రజల గుసగుస, భావి తరాలకు ఉపయోగపడే ఎంతో విలువైన ప్రభుత్వ భూములను అక్రమార్కుల పాలు చేస్తున్నారని పాలవంచ ప్రజలు అభిప్రాయపడుతున్నారు,. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ దృష్టి సారించి పాల్వంచలో జరుగుతున్న అక్రమ కట్టడాలను నిలిపివేయాలని, అక్రమ వెంచర్ల కు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని అందుకు సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకొని విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించాలని పాల్వంచ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.... *పాల్వంచ టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్ వివరణ..* పాల్వంచ పట్టణంలో దమ్మపేట సెంటర్ నుండి శ్రీనివాస కాలనీ కి వెళ్ళే దారిలో కుంటి నాగుల గూడెం వరకు 817 ప్రభుత్వ సర్వే నెంబర్ లో నిర్మిస్తున్న, నిర్మించిన భవనాలకు మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. పలు మార్లు కొంతమందికి నోటీసులు ఇచ్చాం అయినా నిర్మాణాలను ఆపకుండా కొంత మంది పూర్తిచేశారు. విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు తెలియపరిచాం. తదుపరి చర్యలు వారే తీసుకోవాలి మా పరిధిలో ఏమి లేదు అని ఇంకా సమాచారం కోరదలుచుకుంటే కమిషనర్ ను అడిగి తెలుసుకోండి అని సెలవిచ్చారు. కమిషనర్ ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్ చేస్తే స్పందించ లేదు.
-----------------------
Reporter