సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించడంతో పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని సీపీ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గ్రామ పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో డీసీపీలు అంకిత్ కుమార్,రాజమహేంద్ర నాయక్,కవిత వరంగల్ పోలీస్ కమిషనర్ ని మర్యాద పూర్వకంగా కలుసుకొని మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ డీసీపీ నుంచి మొదలుకొని హోంగార్డ్ స్థాయి వరకు అందరూ ఎన్నికలు ప్రకటన తేది నాటి నుండి ప్రణాళిక ప్రకారం పనిచేయడంతో పాటు పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా బందోబస్త్ నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయడంలో కీలకంగా నిలిచిన పోలీస్ కమిషనర్ అధికారులు, పోలీస్ సిబ్బందిని అభినందనలు తెలియజేసారు.
-----------------------
Reporter