సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : నాడు దొరల గడీలను బద్దలు కొట్టి దుర్మార్గుల అంతు చూసిన వీరనారీమని చాకలి ఐలమ్మ స్ఫూర్తితో రాష్ట్రానికి పట్టిన ప్రభుత్వ పీడను విరగడ చేస్తామని షాద్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. వీరనారిమని చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా షాద్ నగర్ పట్టణంలో ఆమె విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడారు. పెత్తందారుల పీడను విరగడ చేసి ఎంతో ధైర్యశాలిగా నిలిచిన ఐలమ్మ ఆశయాల సాధనలో నేటి పాలకులను కూడా ఎదిరించి తరిమికొడతామని అన్నారు. ప్రభుత్వ పాలనలో అక్రమాలు దౌర్జన్యాలు అవినీతి పెరిగిపోయాయని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ప్రజలను దోచుకు తింటున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి పట్టిన పీడను విముక్తి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రఘు, చెన్నయ్య ఆగిరి రవికుమార్ గుప్తా, దర్శన్, ఆలీం, ముబారక్, అందె మోహన్, నల్లమోని శ్రీధర్, మల్లేష్, శ్రీధర్, గంగమొని సత్తయ్య, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin