Thursday, 30 July 2026 10:25:00 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం...

Date : 05 May 2023 01:07 AM Views : 602

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపహాడ్ మండలం పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గొమ్మూరు కాలనీ శివారు పవిత్రమైన గోదావరి నది తీరమున డాక్టర్ వి.వి.మల్లేశ్వరరావు వ్యవసాయ క్షేత్రంలో అంగరంగ వైభవంగా గురువారం సాయంత్రం శ్రీ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం తిరుమల తిరుపతి దేవస్థానం 20 మంది వేద పండితులు (అర్చకులు) మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా కన్నులు పండుగగా శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరిపించారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదాలు అందజేశారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా టిటిడి రిత్వికుల ఆధ్వర్యంలో సాయంత్రం స్వామివారి కళ్యాణ వేడుక అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. టీటీడీ నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను మూడవ తేదీ సాయంత్రం మోరంపల్లి బంజర గ్రామంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి పూర్ణకుంభాలతో ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి నాగినేనిప్రొలు రెడ్డిపాలెం కళ్యాణ వేదిక వరకు కోలాట నృత్యాలతో కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. కళ్యాణ వేడుక అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి, అనంతరం పదివేల మంది భక్తులకు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రుల అయ్యారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ సంకల్ప దాత డాక్టర్ వివి మల్లేశ్వరరావు , ప్రజా ప్రతినిధులు , గ్రామ పెద్దలు నిర్వాహకులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు బందోబస్తు... డిఎస్పి వెంకటేష్ ఆదేశాల మేరకు సి ఐ నాగరాజు ఆధ్వర్యంలో ఎస్ఐ సంతోష్ తో పాటు మొత్తం ఐదుగురు ఎస్ఐలు , ఏసి సత్యనారాయణ తోపాటు 70 మంది పోలీస్ సిబ్బందితో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భారీ వాహనాలను మొరంపల్లి బంజర మీదుగా సారపాక వైపు దారి మళ్లించారు. సుమారు 12,000 మంది స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త చర్యక ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :