Sunday, 13 September 2026 02:06:47 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మద్యం సేవిస్తే వీడు మనిషే కాదు సైకో కిల్లర్ అరెస్ట్‌...

Date : 13 November 2024 01:27 PM Views : 808

సర్కార్ టీవీ న్యూస్ / మెదక్ జిల్లా : చిన్న శంకరం పేట్ మండల కేంద్రంలో వరుస హత్యలు జరిగాయి. దీనితో ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. విచారణను వేగంవంతం చేయగా నిందితుని గురించి నిర్గాంతపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా ఎస్పీ ఉదయ్ చెప్పిన వివరాల ప్రకారం నిందితుడు మల్లేష్ మద్యం సేవించాక సైకో లాగా మారుతాడు. మద్యం తాగినాక ఎవరినైనా కొట్టాలి.. లేదా చంపాలి అనే ఆలోచన వస్తుంది. అందుకే ఇప్పటి వరకు మూడు హత్యలఉ చేశాడు. మరో 5 హత్యాయత్నాలకు పాల్పడ్డట్లు జిల్లా ఎస్పీ తెలిపారు... నిందితుడు ఎక్కువగా రైళ్లో ప్రయాణాలు చేస్తూ.. మద్యం షాపుల వద్ద హత్యలు చేయడం అలవాటుగా ఎంచుకున్నాడు. నిందితుడు మల్లేష్ పాత నేరస్తుడు. 2013లో చిన్న శంకరంపేట మండలంలోని తన సొంత ఊరు అయిన రుద్రారం గ్రామంలో నర్సయ్య అనే వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసులో 2017లో జైలుకు వెళ్లి 2019 వరకు చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవించాడు. చిన్న శంకరంపేటలో గత నెల 24వ తేదీన కామారెడ్డి జిల్లా వాస్తవ్యుడు నవీన్ అనే వ్యక్తిని హత్య చేశాడు. అదే మండలం అనంత పద్మనాభ స్వామి గుట్ట బస్టాండ్ వద్ద నిజామాబాద్ జిల్లాకు చెందిన కొమీరే స్వామి అనే వ్యక్తిని హత్య చేశాడు.అలాగే దీపావళి రోజున రైలులో సుత్తె తో ఓ వ్యక్తి తల పగులగొట్టి హత్యాయత్నం చేశాడు. ఇతని పై ఐదారు హత్య కేసులు ఉన్నాయి. వాటిపైన విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు మల్లేష్ హత్య చేసిన వారి నుండి తీసుకున్న డబ్బులను, వస్తువులను తన మిత్రుడు రమేష్‌కు ఇస్తాడు. వరుస హత్యలపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మల్లేష్‌ తోపాటు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి ఐదు సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, బంగారు చైన్, గోల్డ్‌ రింగ్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: