Saturday, 18 April 2026 06:18:11 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

పావనిని హత్య చేసిన నిందితుడు అరెస్ట్...

Date : 02 November 2023 10:00 AM Views : 205

సర్కార్ టీవీ న్యూస్ / తిరుపతి జిల్లా : వరదయ్యపాలెం మండలం లోని బత్తల వల్ల గ్రామంలో రెండు రోజుల క్రితం గర్భవతి అయిన భార్య పావనిని హత్య చేసిన భర్త కాటయ్య ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.... ఈ సందర్భంగా సీఐ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ దాదాపు గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఓ మొబైల్ పరిశ్రమలో పనిచేస్తున్న కాటయ్యకు అదే పరిశ్రమలో పనిచేస్తున్న పావనికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారి తరువాత పెద్దలను ఎదిరించి సూళ్లూరుపేటలోని ఓ దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకునారు... వీరిద్దరికీ ఓ కుమారుడు ఓ కుమార్తెతో పాటు ప్రస్తుతం పావని నిండు గర్భంతో ఉందని.... కాటయ్య తాగుడుకు ఇతర వ్యసనాలకు బానిసై తరచూ డబ్బుల కోసం భార్యను పుట్టింటి నుండి డబ్బులు తేవాలని వేధిస్తూ చిత్రహింసలు పెట్టేవాడని ఇలా చేసినప్పుడల్లా తల్లిదండ్రులకు తన గోడును వెల్లబుచ్చుకొని అక్కడి నుండి డబ్బులు తీసుకుని వచ్చి భర్త కాటయ్యకు ఇచ్చేదని.... గత నాలుగు నెలల క్రితం ఇదేవిధంగా డబ్బులు తేవాలని కాటయ్య వేధించడంతో అడ్డు చెప్పిన పావనిని తీవ్రంగా గాయపరచడంతో వారి తల్లితండ్రులు ఆమెను తీసుకుని వెళ్లి చికిత్స చేసి అల్లుని పిలిపించుకొని అతడికి డబ్బులు ఇచ్చి తమ బిడ్డను బాగా చూసుకోవాలని చెప్పి పంపించడంతో తిరిగి ఈ వేధింపులు చేస్తూనే మరోవైపు తన భార్యపై అనుమానం పెరగడంతో గత కొంతకాలంగా భార్యను తీవ్రంగా వేధించేవాడని రెండు రోజుల క్రితం ఇంటిలో ఎవరూ లేని సమయంలో తిరిగి గొడవపడి ముందే తెచ్చి పెట్టుకున్న కత్తులతో ఆమె మెడ పై తీవ్రంగా దాడి చేయడంతో కుప్పకూలిన పావని... స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న పావనిని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు ఈరోజు అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామని తెలిపారు. తన వాళ్లను కాదని అందర్నీ వదిలేసి ప్రేమించి పెళ్లాడి నువ్వే నా ప్రపంచమని కోటి కలలు కన్నా పావని ఈ విధంగా కట్టుకున్న వాడి చేతిలోనే హతమవడం అందులోనూ తల్లితో పాటే గర్భంలో బిడ్డ కూడా తుది శ్వాస వదలడం పోస్టుమార్టం సందర్భంగా ఆ బిడ్డను తీసినప్పుడు చూసిన ప్రతి ఒక్కరి గుండె బరువెక్కి ఆ క్షణాలు వర్ణనాతీతం.... ఏ బంధమైనా నమ్మకంతోనే నడుస్తుంది... ఇదే సృష్టి ధర్మం... నువ్వే నా ప్రపంచం అనుకున్న అర్ధాంగిని అనుమానంతో హతమార్చిన వైనం దారుణం... సంసార జీవితాలలో అనుమానం పెనుభూతమైతే ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి... ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న ఆ ఇద్దరు చిన్నారులు అనాధలకు మారడం బాధాకరం...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :