Monday, 14 September 2026 05:59:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

Date : 02 November 2025 10:20 PM Views : 176

సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : గణపురం సర్కార్ న్యూస్,( డి కుమార్ ) భూపాలపల్లి నియోజకవర్గం గణపురం పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ మరియు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే లతో కలిసి భూమిపూజ మరియు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ... ప్రజలు, అధికారులు అందరి సహకారంతోనే భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమన్నారు. అదేవిధంగా, గాంధీనగర్ నుండి - జంగాలపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులకు రూ.20 కోట్ల నిధులు, హనుమాన్ కట్ట నుండి కొత్తపల్లి వరకు రూ.18 కోట్ల నిధులతో సీడీఎఫ్ నిధులతో పాటు కేంద్ర నిధులతో మండల కేంద్రాన్ని టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కోటగుళ్ళు, రెడ్డిగుళ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. త్వరలోనే కాటేజిలతో పాటు బోటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. స్టేషన్ ఆవరణలో 2 ఎకరాల స్థలం ఉందని అందులో పోలీసుల కొత్త క్వార్టర్స్ నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, గణపురం సర్కిల్ సీఐ కరుణాకర్ రావు, గణపురం ఎస్సై అశోక్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: