సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : వెంకటాపురం : చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ మరియు వెంకటాపురం వాజేడు మండలాల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని, వెంకటాపురంలోని కనకదుర్గ ఆలయ ప్రాంగణంలో భద్రాచలం రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వెంకటాపురం మండల తాసిల్దార్ సృజన్ కుమార్, వెంకటాపురం వాజేడు చర్ల మండలాల కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు చిడెం సాంబ శివరావు రిబ్బన్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్లతోపాటు స్థానికులు కూడా రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిడెం సాయి ప్రకాష్ వర్మ, సాయి తేజ,బట్టి విజయ్ తాడేటి జయరామ్, వెంకటాపురం వాజేడు మండల ఫోటోగ్రాఫర్ అధ్యక్షుడు చంద్రకళ గారు, ఉపాధ్యక్షులు మాటూరి సతీష్, ప్రధాన కార్యదర్శి ఇల్లందుల శోభన్ బాబు, కోశాధికారి రాగం సాంబశివరావు, మరియు కుప్ప సాంబశివరావు, గౌరవ అధ్యక్షులు వలుస రమేష్, ప్రసాద్ ,బన్నీ, వేల్పుల మనోజ్, బంధ రవి, ఆనంద్, సచిన్, దాడిశెట్టి నాగేశ్వరరావు, కిషోర్ ,రవి, వంకాయల రాము, అశోక్ ,రంజిత్, సతీష్ రెడ్ క్రాస్ సిబ్బంది ఆది,రవి తదితరులు పాల్గొనడం జరిగింది
-----------------------
Admin