సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలోని 7వార్డు పరిధి లోని సాయి బాలాజీ టౌన్ షిప్ లో పోచమ్మ, మైసమ్మ అమ్మవారి బోనాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు శ్రీపాల్ రెడ్డి, మాధవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin