సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిర్వహిస్తున్నటువంటి ఇంటింటికి మోడీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నిజాంబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో ఉన్న లాలన వృద్ధాశ్రమాన్ని సందర్శించి ఆశ్రమ వ్యవస్థాపకులు గడ్డం పైపుల రాజిరెడ్డి గారిని కలిసి వారికి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మోడీ గారి నిస్వార్ధంగా చేస్తున్నటువంటి సేవలను తెలియజేసి. వారిని సన్మానించి మోడీ 20 ఏళ్లు స్వప్నించాడు సాధించాడు మరి తొమ్మిది సంవత్సరాల సేవా సుపరిపాలన పేదల సంక్షేమం అనే పుస్తకాలను రాజిరెడ్డి గారికి ఇవ్వడం అయినది. ఎంపీ అరవింద్ వృద్ధులను పలకరించి వారి బాగోగులు తెలుసుకొని మీ యొక్క ఆశీర్వాదం నరేంద్ర మోడీ పై ఉండాలని రాబోయే కాలంలో మరోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఎన్నికైయ్యే విధంగా మీరందరూ ఆశీర్వాదం ఉండాలని మీరందరూ నరేంద్ర మోడీ గారిని నాయకత్వాన్ని బలపరచాలని ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులను కోరారు. ఇట్టి కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు యామాద్రి భాస్కర్ బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శి ఆకుల రాజు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin