సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన ఊరు మన చెరువు పండుగ పురస్కరించుకొని. అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగుడెం పంచాయతీ, గుంపెన పంచాయతీ , ఎర్రగుంట పంచాయతీ అన్నపురెడ్డిపల్లి పంచాయతీ గ్రామాలలో బాలాజీ ఆధ్వర్యంలో సర్పంచ్ సడియం తిరుపతియ్య అధ్యక్షతన , మహిళలు బతుకమ్మ బోనాలు తో ర్యాలీతో చెరువు వద్ద భారీగా చేరిన గ్రామప్రజలు. అనంతరం కట్ట మైసమ్మ కు, బతుకమ్మకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమ లో స్థానిక తాసిల్దార్ భద్రకాళి, ఎంపీడీవో అన్నపూర్ణ, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.కె షాహినా, ఏవో ప్రశాంత్, పలు గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్ లు పాల్గొని కార్యక్రమాలను ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసినారు.
-----------------------
Admin