సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొంతమంది మోటర్ బైక్ పై స్పీడ్ గా శబ్దాలు చేస్తు స్కూల్ మరియు కాలేజ్ పిల్లలు వచ్చే సమయం లో అటుగా వెళ్తూ వారిని ఇబ్బందులు కలిగిస్తున్నారని పోలీసు వారి దృష్టికి రావడంతో గురువారం పట్టణ ఇన్స్పెక్టర్ జి.రాజశేఖర్ ఆదేశాల మేరకు పరీక్షలు జరిగే సమయంలో భయంకరమైన బైక్ శబ్దాలు చేస్తూ బైక్ పై వెళ్లే ఆకతాయిలను స్పెషల్ డ్రైవ్ చేసి పట్టుకున్నారు. పట్టణ పోలీసులు ఎవరైనా ఇబ్బందులు కలిగించిన బైక్ పై రాష్ డ్రైవింగ్ చేసిన బుల్లెట్ బైక్ ల పై శబ్దాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వారి పై భారిగా చలానాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిసీలు పూర్ణ, మట్టయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు....
-----------------------
Admin