Tuesday, 15 September 2026 01:47:48 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం...

Date : 22 October 2023 08:16 AM Views : 307

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ప్రజల ధన,మాన,ప్రాణాల రక్షణ గురించి అహర్నిశలు కృషి చేస్తున్న పోలీసులు పోలీస్ అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి : జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ దేశ ప్రజల రక్షణ కోసం పోలీసులు చేసే త్యాగం వెల కట్టలేనిదని,ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని,అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొవాలని జిల్లా ఎస్పీ డా. వినీత్.జి ఐపిఎస్ అన్నారు. ఈ రోజు పోలీస్ అమరవీరుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా జిల్లా ఎస్పీ గారు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అమరవీరుల స్మారక స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు.ముందుగా జిల్లా ఎస్పీ గారు గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు.కార్యక్రమంలో బాగంగా ఈ సంవత్సరం కాలంలో దేశవ్యాప్తoగా అమరులైన 189 మంది పోలీస్ అమరవీరుల పేర్లను జిల్లా అదనపు ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్ చదివి వినిపించారు. ఈ సందర్బంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.... 1959 అక్టోబరు 21న పంజాబ్ కు చెందిన 21మంది ఐటిబీపి పోలీసులు సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా విధులు నిర్వర్తిస్తుoడగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూ బాగాన్ని ఆక్రమించెందుకు ప్రయత్నించడంతో హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడరని,ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారన్నారు.హాట్ స్ప్రింగ్ అంటే వేడి నీటి బుగ్గ అని అర్థం కాని భారత జవాన్ల రక్తం తో తడిచిన హాట్ స్ప్రింగ్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలం గా రూపు దిద్దుకుంని,ప్రతి ఏడాది అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ అని అన్నారు. ఇలా ప్రతి సంవత్సరం ఎంతోమంది పోలీసు అమరుల ప్రాణ త్యాగ ఫలితమే నేడు సమాజం స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ ప్రశాంతమైన జీవనాన్ని గడుపుతున్నామని అలాంటి వారి త్యాగాలను స్మరించుకోవడం కోసం ప్రతి సంవత్సరం సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రాణ త్యాగం చేసిన 189 మందిని స్మరిస్తూ వారికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామని అన్నారు. తీవ్రవాదం,ఉగ్రవాదం వంటి విచ్ఛిన్నకర శక్తులు,నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులను అరికట్టి ప్రజల భద్రతకు భరోసా కల్పించడానికి అమరుల త్యాగాలే స్ఫూర్తిగా ప్రజాసేవకు అందరూ పునరంకితం కావాలని ఆకాంక్షించారు.అనంతరం పోలీసు వారి త్యాగాలను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరులకు రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది అందరూ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డి టి.సాయి మనోహర్,ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు,భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ ఐపిఎస్,పాల్వంచ డిఎస్పీ వెంకటేష్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, మణుగూరు డిఎస్పీ రాఘవేందర్ రావు,ఇల్లందు డిఎస్పీ రమణ మూర్తి,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్య స్వామీ,సైబర్ క్రైమ్స్ డిఎస్పీ కృష్ణయ్య ఆర్ఐలు రవి, సుధాకర్,నరసింహారావు,కృష్ణారావు, లాల్ బాబు,నాగేశ్వర రావు మరియు ఇతర సిఐలు,ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :