Sunday, 13 September 2026 11:24:34 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలి... -డిఆర్ఓ కొండయ్య

Date : 21 February 2023 11:55 PM Views : 561

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి ,ఫిబ్రవరి 21 : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సెక్టార్ మరియు రూట్ ఆఫీసర్లు తమ విధులను బాధ్యత యుతంగా నిర్వర్తించాలని జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ లో ని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సెక్టార్ మరియు రూట్ ఆఫీసర్లకు సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై అవగాహన కల్పించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ముఖ్యంగా ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. సెక్టర్ మరియు రూట్ ఆఫీసర్లు, పిఓలు, ఏపీవోలు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని సూచించారు. సెక్టర్. అధికారులు ముందస్తు ప్రణాళిక బద్ధంగా ఆయా పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేసి అవసరమైన మేరకు సౌకర్యాలను గుర్తించి వాటిని పూర్తి చేయాలన్నారు. ఇదివరకే ఎన్నికల నిర్వహణ విధులు నిర్వర్తించిన అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని యధావిధిగా విధులు నిర్వహించాలన్నారు. ఈ అంశంలో ఈనెల 24 లోగా నివేదిక రూపంలో తనకు సమర్పించాలన్నారు. పోలింగ్ సామాగ్రిని మార్చి 12 లోగా తరలించేందుకు వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సులను పుట్టపర్తి ప్రధాన కేంద్రం నుండి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రూట్ ఆఫీసర్లు కూడా తమకు అప్పగించిన పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అలాగే ఆయా మండలాలకు సంబంధించిన పిఓలకు ,ఏపీవోలకు అందుబాటులో ఉండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సహకరించాలని సూచించారు. మార్చి 13న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కోరారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తాసిల్దార్ మైనుద్దీన్ సెక్టార్ మరియు రూట్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: