Saturday, 12 September 2026 06:01:24 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చెన్నారావుపేట జంట హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధించిన వరంగల్ జిల్లా అదనపు న్యాయమూర్తి జె.మైత్రేయి.

Date : 20 May 2026 05:40 PM Views : 697

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని 16చింతల్ తాండలో చోటుచేసుకున్న దారుణ ద్విహత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.భార్యాభర్తలను అత్యంత క్రూరంగా హత్య చేసి, ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ I అదనపు జిల్లా న్యాయమూర్తి జె. మైత్రేయి కఠిన తీర్పు ప్రకటించారు. బి.ఎన్.ఎస్ సెక్షన్లు 333, 103(1), 109, 351(3) మరియు ఆమ్స్ యాక్ట్ సెక్షన్ 25(1 ఏ) కింద నమోదైన ఈ కేసులో నిందితుడు మేకల నాగరాజు అలియాస్ బన్నీ దోషిగా తేలాడు. బి ఎన్ ఎస్ సెక్షన్ 103(1) కింద నేరం రుజువుకాగా, బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 238(2) ప్రకారం “మెడకు ఉరి వేసి మరణించే వరకు” ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. అదనంగా రూ.5 వేల జరిమానా కూడా విధించింది.ఈ ఘటనలో బానోత్ సుగుణ (45), ఆమె భర్త బానోత్ శ్రీను (50) ప్రాణాలు కోల్పోగా, బానోత్ దీపిక (21), బానోత్ మదన్ లాల్ (17) తీవ్ర గాయాలతో బయటపడ్డారు.బాధితులంతా (ఎస్టి)లంబాడి వర్గానికి చెందిన వారు.ఈ దారుణ ఘటనపై బానోత్ ఈరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గూడూరు మండలం గుండెంగా గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.ఈ కేసులో మొదట చంద్ర మోహన్, సిఐ ఆఫ్ పోలీస్, ఎస్ బి వరంగల్ దర్యాప్తు చేపట్టగా, అనంతరం శ్రీనివాస్ సిఐ నెక్కొండ సర్కిల్ విచారణ కొనసాగించారు. ప్రస్తుతం చెన్నారావుపేట ఎస్సై గా రాజేష్ రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు.ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బృందా దేవి సమర్థవంతమైన వాదనలు వినిపించడంతో కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడినట్లు న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: