Wednesday, 29 July 2026 05:32:38 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జనాభా లెక్కల ప్రకారం యాదవులకు సీట్లు కేటాయించాలి... -టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

Date : 27 August 2023 07:57 AM Views : 482

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : రాష్ట్రంలో యాదవుల జనాభా ఎంత ఉన్నారో ఆ లెక్క ప్రకారం రాజకీయ పార్టీలు అవకాశాలు కల్పించాలని పలు యాదవ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. యాదవుల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాలు స్పష్టం చేయాలని కోరాయి. యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నాగోల్ లోని శుభం కన్వెన్షన్ హాలులో జరిగిన యాదవ యుద్ధభేరి సభకు చలకాని వెంకట్ యాదవ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి పలు రాజకీయ పార్టీల నాయకులు, యాదవ సంఘాల నేతలు, వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్బంగా యాదవ విద్యా వంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో 18 శాతం జనాభా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం నామమాత్రమని ఆందోళన వ్యక్తం చేశారు.జనాభాలో 18% ఉన్న యాదవులకు 22 ఎమ్మెల్యే, 3 లోక్ సభ, 2 రాజ్యసభ, 7 ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలని, బడ్జెట్ లో 18 శాతం నిధులు కేటాయించాలని, జనగణలో కులగణన చేసి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లు రద్దు చేసి, యాదవులకు SNT రిజర్వేషన్ లు ఇవ్వాలని, విద్యా ఉద్యోగ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని , యాదవుల అభివృద్ధి, రాజకీయ ప్రాతినిధ్యం పై యాదవ డిక్లరేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ జాతీయ జనరల్ సెక్రెటరీ ఆర్ లక్ష్మణ్ యాదవ్ లకు నాగా సీతారాములు సన్మానం చేసారు. ఖమ్మం జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు చింతలచెరువు.లక్ష్మి,ఓబీసీ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం యాదవ్, యాదవ్ ఉద్యోగస్తుల సంఘం జిల్లా అధ్యక్షుడు దుబ్బాకుల శ్రీనివాస్ యాదవ్,మారబోయిన. హరిబాబు యాదవ్, సత్తి వెంకన్న యాదవ్ , పొదిల సతీష్ యాదవ్, పొదిల తిరుపతిరావు యాదవ్, మొర్రి మేకల కోటయ్య యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: