సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : బి.ఆర్.ఎస్.పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జి బడే నాగజ్యోతి మతి తప్పి మాట్లాడుతున్నారని అంటున్న ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ రేగ కళ్యాణి మేడారం సమ్మక్క - సారలమ్మ తల్లులను కూడా రాజకీయంగా ఎదగడానికి వాడుకోవాలని చూస్తున్న నీచమైన వ్యక్తులు బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులు... కమిషన్ల కోసం కక్కుర్తి పడిన పార్టీనే బి.ఆర్.ఎస్.పార్టీ.. సీతక్క అంటేనే అభివృద్ధికి మారుపేరు, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. సమ్మక్క -సారలమ్మ వారసత్వం... మేడారం జాతర అభివృద్ధిని ప్రపంచం నలుమూలల తెలిసేలా మేడారం జాతర ఏర్పాట్లు చేస్తున్న సీతక్క ని చూసి ఓర్వలేని కొందరు సీతక్క మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు... మీ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు అనుకుంటున్నావా నాగజ్యోతి కమిషన్ల కోసం మీరు కక్కుర్తి పడ్డట్టు కాంగ్రెస్ పార్టీ పడదు.. మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర గురించి నువ్వు మాట్లాడుతుంటే నవ్వొస్తుంది నాకు కనీసం నువ్వు బి.ఆర్.ఎస్.పార్టీ అధికారంలో జెడ్పీ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు కనీసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం జాతరకు రాకుండా గిరిజన జాతరను, గిరిజనులను వారి సంస్కృతిని అవమానించినపుడు ఎక్కడికి వెళ్ళావు నాగజ్యోతి... గత పదేండ్ల అధికారంలో ఉన్న బి.ఆర్.ఎస్.పార్టీ ఎన్ని కోట్లు మేడారం అభివృద్ధికి ఇచ్చారో చెప్పు నువ్వు... కనీసం నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా మేడారం అభివృద్ధి కొరకు ఎన్ని నిధులు తెచ్చావుఅసలు నీకు సీతక్క గురించి మాట్లాడే అర్హతనే లేదు.కమిషన్ల కోసం కక్కుర్తి పడే పార్టీనే బి.ఆర్.ఎస్.పార్టీ అభివృద్ధి పేరిట పచ్చని పంట పొలాలను లాక్కొని నష్ట పరిహారం కూడా అందించని పార్టీ బి.ఆర్.ఎస్.పార్టీ.. ఇప్పటికైనా నువ్వు మేడారం జాతర అభివృద్ధికి అడ్డుపడకుండా, అభివృద్ధికి దోహదపడాలి.. సమ్మక్క - సారలమ్మ జాతర అభివృధ్ధి విషయంలో కూడా రాజకీయం చేయడం సరైన పద్ధతి కాదు... నాగజ్యోతి నువ్వు రాజకీయంగా ఎదగడానికి ప్రతి ఒక్క పనికి అడ్డుపడి, సీతక్క గారిని విమర్శిస్తే రాజకీయంగా ఎదుగుతం అనుకోవడం తప్పు.. గత పదేండ్ల బి.ఆర్.ఎస్.పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేడారం జాతర సమయంలో ఎంతమందికి పంట నష్టం కల్పించారో చెప్పుకావాలని ఇప్పుడు నీ రాజకీయ భవిష్యత్తు కోసం సామాన్యులను ఎగవేయడం కరెక్టు కాదు నాగజ్యోతి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పదేండ్ల ప్రభుత్వంలో మేడారం జాతర కోసం ఎన్ని నిధులు మంజూరు చేశారు.. సీతక్క రెండేండ్ల అధికారంలో ఉండి ఎన్ని నిధులు కేటాయించి శాశ్వత పరిష్కారం చేస్తున్నారో గమనించాలి అని అన్నారు.. ఇప్పటికీ అయిన నీకు చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధికి అడ్డుపడకుండా, దోహదపడాలి... ఇకనైనా రాజకీయంతో కాకుండా మానవత్వంతో ఆలోచించు.గిరిజనుల ఆరాధ్య దైవం సమ్మక్క - సారలమ్మ జాతరను అవమానించిన పార్టీ బి.ఆర్.ఎస్ పార్టీ... ఖచ్చితంగా మేడారం జాతర ప్రారంభం అయ్యేవరకు జాతర పనులన్నీ పూర్తి చేస్తాం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాతర నిర్వహిస్తాం... గిరిజనుల సంస్కృతిని ప్రపంచం నలుమూలల తెలిసేలా మేడారం జాతరను అభివృద్ధి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తుంచుకో... ఇకనైనా నీ పద్ధతి మార్చుకొని అభివృద్ధికి అడ్డుపడకుండా ఉండాలని హితవు పలికారు
-----------------------
Reporter