Monday, 14 September 2026 10:05:11 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో వ్యహరించి చెరువును పరిరక్షించలి...

Date : 12 June 2023 11:34 PM Views : 299

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో తుర్కయంజాల్‌లోని మాసాబ్‌ చెరువు ఆక్రమాణలపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు ఆక్రమాణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు. మాసాబ్ చెరువును కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. చెరువు ప్రాంతంలోని సర్వే నెంబర్లు 205, 137లో మట్టి నింపిన ప్రాంతాలను ఇరిగేషన్‌, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో కలిసి కిషన్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్‌ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.చెరువులో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టిని డంప్‌ చేస్తుంటే ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. హెచ్‌ఎండీఏ అధికారులు మంగళవారం చెరువు పరిశీలనకు వస్తారని.. ఇరిగేషన్‌ అధికారులు సమన్వయంతో వ్యహరించి చెరువును పరిరక్షించేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. నాగార్జున సాగర్‌ రహదారికి పక్కనే చెరువు ఉండటంతో కబ్జాకోరుల కన్ను చెరువుపై పడిందని మండిపడ్డారు. సర్వే నెంబర్‌ 137లో రోడ్డు కోసం పెద్ద ఎత్తున మట్టిని నింపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు, ఇరిగేషన్‌ అధికారులకు సూచించారు. మట్టిని నింపిన వారే.. తిరిగి తీసే విధంగా చర్యలు తీసుకోవాలని.. దానికి అయ్యే ఖర్చు మొత్తం వారే భరించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్‌ ఛైర్మన్​ కొత్తకుర్మ సత్తయ్య, సీనియర్‌ నాయకులు కందాడ లక్ష్మారెడ్డి, మాసబ్ చెరువు పరిరక్షణ సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: