Thursday, 30 July 2026 08:23:50 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అక్రమంగా 4 ఎకరాలు పట్టా పొందిన కందుల సుదిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కి వినతి...

Date : 24 December 2024 10:07 AM Views : 438

సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం లో ఆస్తులు కోల్పోయిన వాసి కి పునరావాసం కింద ఇచ్చిన భూమిని అక్రమంగా పట్టా పొందిన కందుల సైదిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని బాధితులు కలిమెల వెంకటయ్య ఆరోపించారు. బాధితుడు కలిమెల వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణదశలో ముంపుకు గురైన చిన్నమ్మ గూడెం తాలుకు దేవరకొండ వాసి కలిమెల చిన్న వెంకయ్య పేరున నాటి ప్రభుత్వం పునరావాసం చట్టం కింద దామరచర్ల మండలం రాజుగట్టు గ్రామ శివారు సర్వేనెంబర్ 826 /33/1 న పునరావసం చట్టం కింద 4 ఎకరాలు 4 గుంటలు ఇంటి స్థలం ఇవ్వడం జరిగిందన్నారు. తాను జీవనోపాధి కోసం రాజు గట్టు గ్రామం విడిచి తన కుటుంబంతో ములకల కాలువ వలస వెళ్లి జీవిస్తున్నానని అన్నారు. ఇట్టి భూమిపై కన్ను వేసిన దామరచర్ల కేంద్రానికి చెందిన కందుల సైదిరెడ్డి రాజాగట్టు గ్రామంలోని అదే పేరుతో ఉన్న వ్యక్తిని నమ్మించి అతని వద్ద నాలుగు ఎకరాలు భూమిని కొనుగోలు చేసినట్టు పత్రాలను సృష్టించి తాసిల్దార్ కార్యాలయం అధికారులను నమ్మించి పట్టా సృష్టించినట్లు ఆరోపించారు.ఇంతలోనే అసలు వ్యక్తి అయినా కరిమెల వెంకటయ్యకు విషయం తెలియడంతో రాజగట్టు గ్రామంలోని తన భూమి వద్దకు వెళ్లి గమనించగా నాలుగు ఎకరాల భూమిని సైదిరెడ్డి స్వాదినపరుచుకున్నట్లు పేర్కొన్నారు.తాను గాని తన తండ్రి కానీ నాడు ప్రభుత్వం పునరావసం కింద ఇచ్చిన భూమిని నాటినుండి నేడు వరకు మేము ఎవరికీ అమ్మకం జరపలేదని కందుల సైదిరెడ్డి కావాలని తన భూమిని అక్రమంగా పట్టా చేయించుకుని చీటింగ్ చేశారని ఆగ్రహించారు. తనకు తెలియకుండానే తన భూమిలో బత్తాయి తోట వేశారని ఆరోపించారు. ఇంతటి అక్రమాలకు పాల్పడిన పాల్పడిన కందుల సైదిరెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తన తండ్రి కలిమెల చిన్న వెంకయ్య పేరున రికార్డు కలిగి ఉన్న భూమిని తనకు ఇప్పించి తన కుటుంబానికి న్యాయం చేయాలని ఆవేదనతో సబ్ కలెక్టర్ ను కోరారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: