సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను తప్పకుండా నెరవేరుస్తాం. కౌల్పూర్ గ్రామంలో ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదు. దత్తాపూర్, కౌల్పూర్ పూర్ గ్రామాలు కాంగ్రెస్ కు కంచుకోట. జోగిపేట్ గ్రామస్తులు ముక్తకంఠంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రో ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డిని పూర్తి లిఖితపూర్వకంగా రాసి ఇచ్చిన గ్రామస్తులు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఈ రెండు వారాల్లో తరిమికొట్టే సమయం వచ్చిందని ప్రజలందరూ ఏకమై ఉన్నారని ఆయన అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న పేదల భూములను అక్రమంగా లాక్కున్నాడని, వాటిని బినామీ పేర్ల మీద రాయించుకున్నాడని ఆరోపించారు. నీ యొక్క వర్గంలో ఉన్న అసెంబ్ భూములను కూడా వదలకుండా వాళ్ళ అక్క చెల్లి తమ్ముడు పేర్లపై మార్చుకున్నాడని ఆరోపించారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలందరూ తరిమి తరిమి కొడతారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ రావాలి చేతు గుర్తుకే మన ఓటు వినయ్ రెడ్డికి గెలిపించుకుంటామని ముక్తకంఠంతో తెలియజేశారు. నందిపేట్ మండలంలోని దత్తాపూర్,కౌల్పూర్, జోగిపేట్, వెంకటేశ్వర కాలనీ, గ్రామాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలిపారు. భారీ మెజార్టీతో గెలిపిస్తామని యువకులు మహిళలు వృద్ధులు అందరు కూడా చేతు గుర్తుకే ఓటు వేస్తామని చెప్పారు. నాపై ఉన్న మీ విశ్వాసం ఎప్పటికీ పోనిచ్చుకోనని ఎల్లవేళలా మీ వద్ద ఉంటానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా 60 రోజుల్లో ప్రతి ఒక్కరికి నెరవేరుస్తామనిచెప్పారు. తెలంగాణ మొత్తం ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కోరుకుంటూ న్నారని అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అవుతున్నాడని అన్నారు. ప్రజలు గెలిస్తేనే నేను గెలిచినట్లు అని ప్రజలకు వాగ్దానం చేస్తున్నారు. బీ ఆర్ఎస్ దొంగ ఎమ్మెల్యే ను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే జైల్లో పెడతామని అన్నారు. దత్తాపూర్, కౌల్పూర్, జోగిపేట్ గ్రామస్తులు పూర్తిగా మద్దతు తెలిపినారు. మహిళలు మంగళహారతులతో రంగ స్వాగతం పలికారు. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. ఈ ప్రచారంలో భాగంగా అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు భారీ ఎత్తున మహిళలు యువకులు ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin