Sunday, 13 September 2026 11:45:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మైనారిటీ స్టేటస్ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకోండి...

Date : 18 May 2025 08:44 PM Views : 874

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : *మైనారిటీ స్టెటస్ సర్టిఫికేట్ కు దరఖాస్తు చేసుకోండి* -జిల్లా మైనారిటీ అద్యక్షులు యాకూబ్ పాషా *కొత్తగూడెం:* ఈ యేడాది 2025 లో జరగనున్న , నీట్, జేఈఈ కౌన్సెలింగ్ కు హాజరు కానున్న మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు 'మైనారిటీ స్టేటస్' సర్టిఫికేట్ కొరకు స్తానిక ఈ-సేవ సెంటర్ లలో దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అద్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటన లో తెలిపారు. నీట్ ద్వారా యంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో మరియు జేఈఈ మేయిన్ ద్వారా ఐఐటీలో, యన్ఐటీ లలో, ఈఎపిసెట్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ లలోప్రవేశాల కొరకు నిర్వహించే కౌన్సిలింగ్ లో మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ సమర్పించవలసి ఉంటుందని, గతంలో ఈ సర్టిఫికేట్లను, విద్యార్దులు తాము చదివిన పాఠశాలల నుండి పొందేవారని, రాష్ట్ర రెవిన్యూ శాఖ వారు గతంలో విడుదల చేసిన జీ.ఓ ప్రకారం విద్యార్దులు తహశీల్దార్ కార్యాలయం నుండే మైనారిటీ స్టేటస్ సర్టిఫికేట్ పొందాలని, ఇందుకు గాను రెవిన్యూ శాఖ విడుదల చేసిన దరఖాస్తు ఫారంతో పాటు ఓ.సి, బిసి-సి, బిసి-ఈ, బిసి- బి కుల సర్టిఫికేట్ , 10వ తరగతి టి.సి, అధార్ కార్డు లేదా రేషన్ కార్డు, నీట్, జేఈఈ, ఈఎపిసెట్ -2025, ర్యాంక్ కార్డుతో ఈ-సేవ సెంటర్లో సమర్పించవలసి ఉంటుందని తెలిపారు. కావున మైనారిటీ వర్గాలకు చెందిన ముస్లింలు, క్రిస్టియన్ లు, సిక్కులు, జైనులు, బౌద్దులు, జోరాస్ట్రీయన్ లు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. సూచించారు. ఇతర సమాచారం కోసం మరియు మైనారిటీ స్టేటస్ దరఖాస్తు ఫారం కొరకు 8520860785, నంబర్ కు సంప్రదించాలని తెలిపారు. సర్కార్ టీవీ ప్రతినిధి ఆసిఫ్

-----------------------

షేక్ ఆసిఫ్

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :