సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : దేశాన్ని సన్మార్గం వైపు నడిపించి భారతీయుల సామరస్యాన్ని కాపాడి ఆర్థికంగా ఎదిగేందుకు ప్రగతి పురోగతి నిలవాలంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో మళ్ళీ అధికారంలోకి రావాలని నియంతృత్వ నియంతలుగా నికృష్ట ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ దుష్ట పాలన అంతమొందాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో వీర్లపల్లి శంకర్ భారీ ర్యాలీ నిర్వహించారు అంతేకాకుండా ఓ వికలాంగుడితో కలసి అతని వాహనంతో పట్టణంలో ర్యాలీలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలో పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగిన వేడుకలకు వీర్లపల్లి శంకర్ తదితర శ్రేణులు హాజరయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు వారు కాంగ్రెస్ పార్టీ స్థలంలో నివాళులు అర్పించారు. ఆపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ... దేశ ప్రజలకు స్వాతంత్ర్య ఫలాలు అందించాలని లక్షలాది కాంగ్రెస్ శ్రేణులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. ఈరోజు ప్రధానంగా ముగ్గురిని మనం స్మరించుకోవాలన్నారు. ‘‘అహింస మార్గంతో పోరాటం చేయవచ్చని నిరూపించిన మహనీయుడు మహాత్మా గాంధీ .. దేశంలో ఓటును ఆయుధంగా మార్చి అందరికీ సమాన హక్కులు కల్పించారు అంబేద్కర్.. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న దేశాన్ని సంక్షేమ ఫలాలు అందించిన మహా నేత నెహ్రూ ఆని ఈ ముగ్గురిని మనం స్మరించుకుని నివాళులు అర్పించాల్సిన బాధ్యత మనపై ఉంది’’ అని చెప్పుకొచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత ఇందిరా గాంధీ అని కొనియాడారు. దేశంలో ఐటీ రంగంలో గొప్ప స్ఫూర్తినిచ్చిన గొప్ప ప్రధాని రాజీవ్ గాంధీ అని తెలిపారు. అలాగే దేశాన్ని ఆర్థికంగా పురోగతివైపు నడిపించింది పీవీ, మన్మోహన్ అని పేర్కొన్నారు. దేశంలో విభజించు పాలించు విధానాన్ని ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ అవలంబిస్తోందని విమర్శించారు. విద్వేషాన్ని వీడాలని భారత్ జోడోతో రాహుల్ గాంధీ స్ఫూర్తి నింపారన్నారు. నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు చేసిన 60 ఏళ్లలో చేసిన అప్పుకంటే ఎనిమిదేళ్లలో మోదీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారని దుయ్యబట్టారు. దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందన్నారు. బీజేపీ వస్తే జీడీపీ పెరుగుతుందన్నారు. కానీ పెరిగింది గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు అని వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. మణిపూర్ మండుతుంటే మోదీ, అమిత్ షా కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్‌లో సైన్యాన్ని పంపి నిలువరించాల్సింది పోయి, కాంగ్రెస్ ఓడించేందుకు ఈడీ, సీబీఐని పంపించారన్నారు. నియంతలకంటే నికృష్టాంగా మోదీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కోట్ల భారతీయులందరికీ శంకర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అయన వెంట పట్టణ నాయకులు చెన్నయ్య మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ శ్రీకాంత్ రెడ్డి ఇంకా మరెన్నో నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు భీశ్వ కిష్టయ్య, ప్రతాప్ రెడ్డి తదితర నాయకులతో కలివిడిగా తిరిగారు.
-----------------------
Admin