సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ / ఈనెల 28న రాజమండ్రిలో ఎన్టీఆర్ శత జయంతి దినోత్సవం సందర్భంగా జరిగే మహానాడు కార్యక్రమంను జయప్రదం చేయాలని టిడిపి పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు బెల్లంకొండ రామజోగి గౌడ్ పార్లమెంట్ అధికార ప్రతినిధి సోమగాని నరేందర్ గౌడ్ లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎస్ కే అలీ అధ్యక్షతన హుజూర్ నగర్ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బెల్లంకొండ రామ జోగి గౌడ్ ,సోమగాని నరేందర్ గౌడ్ లు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ఏర్పాటు చేసి పేదలకు ఉపయోగపడే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదల పాలిట దేవుడయ్యారని, అటువంటి మహనీయుడు శతజయంతి దినోత్సవంను అత్యంత వైభవంగా నిర్వహించాలని, తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నలమాద శ్రీనివాస్ యాదవ్, గార్లపాటి శ్రీను, ఎలక వెంకటేశ్వర్లు గౌడ్, వెంకట్రాం నాయక్, పొందూరు సత్యనారాయణ చౌదరి, ఆవులపాటి శ్రీను, కొమర్రాజు రాజు అంజి, మేకల వెంకటేశ్వర్లు, దొంతగాని సోమయ్య, కట్టెబోయిన ఉపేందర్ యాదవ్, మరియు వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin