సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ :నవంబర్ 30న జరగనున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతున్నందున సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు షాద్ నగర్ పట్టణ సిఐ ప్రతాప్ లింగం ప్రజలకు పలు సూచనలు జారీ చేశారు. ప్రజల అభీష్టాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి, ప్రజాస్వామ్య ప్రక్రియను పరిరక్షించడానికి, శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సమస్త ప్రజలకు ఈ సందర్భంగా పోలీసు శాఖా తరుపున వారు విజ్ఞప్తి చేశారు. ఓటర్లు ఎలాంటి భయం, బెదిరింపు, హింస లేకుండా తమ స్వేచ్ఛాయుత హక్కులను అనుభవించుకోవచ్చని, రేపటి నుండి నామినేషన్లు వేయడం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో షాద్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో అభ్యర్థులు ఉదయం11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తమ నామినేషన్లను వేయవచ్చన్నారు. నామినేషన్లు వేయడానికి చివరి తేదీ 10-11-2023 , అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 15-11-2023 ఉంటుందనీ తెలిపారు. ఎన్నికల వేళ శాంతి భద్రతలను కాపాడేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంఘటనలను నివారించడానికి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అనుమతులు లేకుండా సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహించరాదని తెలిపారు. నామినేషన్లకు సంబంధించి 03-11-2023 నుండి 15-11-2023 వరకు ఆర్డీవో కార్యాలయం వద్ద వంద మీటర్ల (100 మీటర్లు) వ్యాసార్థంలో కేవలం ఐదుగురు (5) మాత్రమే లోపలికి అనుమతించడం జరుగుతుందన్నారు. పోలీసువారి ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే ప్రాసిక్యూషన్‌కు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రజలకు హెచ్చరించారు. ఈ ఆదేశాలు 03-11-2023 నుండి 15-11-2023 వరకు ఉదయం 10.00 నుండి సాయంత్రం 06.00 వరకు అమలులో ఉంటాయని షాద్ నగర్ పట్టణ సిఐ ప్రతాప్ లింగం తెలిపారు.
-----------------------
Admin