సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు ప్రజలను గంగిరెద్దులుగా మారుస్తున్నారని ఘాటుగా విమర్శించారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం బిజెపి ఆందోళన చేపడితే టిఆర్ఎస్ అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజలను గంగిరెద్దులు చేసే ఆడిస్తుంది అధికార పార్టీ నాయకులని విమర్శించారు గత తొమ్మిదేళ్లుగా లక్ష్మీదేవి పల్లిని నాన్చుతూ వస్తున్నారని అన్నారు. ప్రజలు రెండుసార్లు లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ లు నమ్మి ఎమ్మెల్యే అంజయ్య ఓట్లు వేశారని ఇప్పుడు ఆ నమ్మకాన్ని గత రెండు పర్యాయలు వమ్ము చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో బిజెపి స్థానిక నాయకులు లక్ష్మీకాంత్ రెడ్డి నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin