సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూ ర్ నగర్ పట్టణంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ,కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని టిడిపి నల్లగొండ పార్లమెంట్ అధికార ప్రతినిధి సోమగాని నరేందర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ మండల ఎంఈఓ సైదా నాయక్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, హుజూర్ నగర్ పట్టణంలోని ప్రైవేట్ మరియు కార్పొరేట్ పాఠశాలలు అధిక ఫీజు వసూలు చేస్తున్నాయనీ అంతేకాకుండా షూ, టై, బెల్ట్ ,యూనిఫార్మ్స, పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్స్ అమ్మకూడదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా అమ్మకాలు జరుపుతూ విద్యార్థుల తల్లిదండ్రులను ఆర్థికంగా నిలువు దోపిడీ చేస్తున్నాయన్నారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కొరకు వేసిన ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య తిరుపతిరావు కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు బెల్లంకొండ రామజోగి , రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి ఎలక వెంకటేశ్వర్లు గౌడ్ పాల్గొన్నారు.
-----------------------
Admin