Wednesday, 29 July 2026 01:46:28 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మౌన నిరశన...

Date : 24 March 2023 06:59 AM Views : 778

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : దేశంలో ప్రతి పక్షాలను అంతం చేసే కుట్ర జరుగుతోందని *జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ గారు * ఆరోపించారు. రాహుల్ గాంధీ కి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ బీజేపీ విధానాలపై విరుచుకు పడ్డారు. ఏఐసీసీ ఆదేశానుసారం,TPCC,CLP పిలుపు మేరకు గురువారం జిల్లా కాగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో గాంధీ చిత్ర పటం ముందు రెండు గంటల పాటు మౌన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కి పెరిగిన ప్రజాదరణ తట్టుకోలేక బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కవ్వింపు చర్యలకు దిగుతుందని విమర్శించారు. రాహుల్ గాంధీ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా మోడీ ఇంటి పేరు ప్రస్తావనే తీసుకురాలేదని రాహుల్ గాందీ పై పన్నిన కుట్రలో భాగంగానే ఆయనపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కోర్టులో తాను చెప్పినప్పటికీ కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. రాహుల్ గాందీ కుటుంబం పై నిందలు వేస్తే గాంధీ ని అవమానించడమే అని అన్నారు. రాహుల్ గాంధీ పై నిందలు మోపి బీజేపీ ప్రభుత్వం గాడ్సే వారసులని మరోసారి నిరూపించుకున్నారని ఎద్దేవ చేశారు. స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలు సైతం లెక్కచేయని పార్టీ కాంగ్రెస్ అని ఇటువంటి బెదిరింపులకు మా అధినాయకత్వం భయపడదని ఇకనైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు. అనంతరం పాలేరు పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వర్ రావు గారు మాట్లాడుతూ..దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రతి పక్ష పార్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.బీజేపీ ప్రభుత్వం అధికార మధం పేరుతో రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని మండిపడ్డారు. అనంతరం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ గారు మాట్లాడుతూ..భారత దేశ పౌరులకు రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరికీ మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారని అది ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద నేరంగా కనిపిస్తుందని అసహనం వ్యక్తం చేశారు.మోడీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ లను దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ ప్రశ్నించే వారిపై దాడులు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పై పెరుగుతున్న అభిమానాన్ని చూసి ఓర్వలేకనే సంబంధం లేని కేసుల్లో కాంగ్రెస్ అధినాయకత్వాన్ని ఇరుకిస్తుందని ఆరోపించారు. ఎన్ని కుత్రంత్రాలు పన్నినా రాహుల్ గాంధీ భయపడే నాయకుడు కాదని తెలిపారు. రాబోవు రోజుల్లో దేశంలో , రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విరితోపాటు రాష్ట్ర మైనారిటి నాయకులు బి యచ్ రబ్బాని,రాష్ట్ర యస్ టి నాయకులు బానోత్ రాజు,నగర కాంగ్రెస్ కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు,దుద్దుకూరి వెంకటేశ్వర్లు,లకావత్ సైదులు నాయక్,పల్లెబోయిన భారతి చంద్రం,మండల కాంగ్రెస్ అధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి,తలారి చంద్రప్రకాష్,గింజల నర్సిరెడ్డి,భూక్యా బాలాజీ నాయక్, నగర ఓ బి సి సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్,నగర సేవాదళ్ అధ్యక్షులు Sd గౌస్,ఎంపీటీసీ నల్లమోతు లక్షయ్య,మాజీ కౌన్సిలర్ పాలకుర్తి నాగేశ్వరావు,నూకారపు వెంకటేశ్వర్లు,దిరిశాల వేంకటేశ్వర్లు,కొట్టేముక్కల నాగేశ్వరావు,ఇబ్రహీం,గడ్డం వెంకటయ్య, భోజడ్ల సత్యనారాయణ,గడ్డి కొప్పుల ఆనందరావు,బీరెడ్డి రమేష్,మద్ది వీరారెడ్డి, కాళంగి కనకరాజు,పూర్ణ,చింతల ఉపేందర్, మహామూద్,ముజాహిద్దీన్,రుకముద్దీన్,అబ్దుల్ అహద్,రంజాన్,పాషా,వాసిమ్,బచ్చలకూర నాగరాజు,యాదవల్లి నాగరాజు,పగికత్తుల సుదర్శన్ ,నారపోగు సుదర్శన్ ,పర్వత శ్రీనివాస్,రెంటాల ప్రసాద్,గోపి,తదితరనాయకులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :